Bhagavanth Kesari Crosses 100 Crores gross in 6th day: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆంధ్ర తెలంగాణతో పాటు ఓవర్సీస్ లో కూడా సినిమాకి కలెక్షన్స్ వర్షం కురుస్తోంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆరు రోజుల కలెక్షన్స్ రిపోర్టు ఎలా ఉందనేది చూద్దాం. ఆరవ రోజు దసరా కలిసి రావడంతో సినిమాకి వసూళ్ల వర్షం కురిసింది. దాదాపు దసరా ఒక్క రోజున 8 కోట్ల వరకు షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల్లో అంచనాలు వెలువడుతున్నాయి. ఇక ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ 70 కోట్ల వరకు అమ్ముడుపోగా ఇప్పుడు గ్రాస్ కలెక్షన్లు దాదాపు 100 కోట్లు దాటి వసూలు చేసినట్లుగా సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
Shraddha Kapoor : మరో లగ్జరీ కారును కొన్న శ్రద్దా కపూర్..ఎన్ని కోట్లో తెలుసా?
నందమూరి బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా మునుపెన్నడూ లేని విధంగా ఉండటంతో ప్రేక్షకులు సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మొత్తం మీద ఆరు రోజుల ప్రపంచవ్యాప్తంగా భగవంత కేసరి వసూళ్లు పరిశీలిస్తే చెప్పుకో తగ్గట్టుగానే వచ్చాయి. నైజాం ప్రాంతం సహా సీడెడ్, ఆంధ్ర, కర్ణాటక అలాగే మిగతా భారతదేశం సహా ఓవర్సీస్ మొత్తం కలిపి 51 కోట్ల 8 లక్షల షేర్ లభిస్తే 104 కోట్ల వరకు గ్రాస్ లభించింది. ఇంకా 15 కోట్ల వరకు ఈ సినిమా కలెక్ట్ చేసేలా టార్గెట్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితులు సినిమాకి చాలా కీలకంగా మారనున్నాయి. ఎందుకంటే ఇప్పటికే దసరా సెలవులు పూర్తయ్యాయి, మరో వారంలోకి ఎంటర్ అయింది కానీ ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలేవి రిలీజ్ కి లేకపోవడంతో భగవంత్ కేసరికి కాస్త కలిసి వచ్చే అంశమనే చెప్పాలి, చూడాలి ఓవరాల్ గా ఈ సినిమా ఎంత వసూలు చేస్తుందని.