Massive Encounter: ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని అటవీ ప్రాంతం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లిపోయింది. భద్రతా బలగాలకు.. మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు చనిపోయారు. భీకర కాల్పుల తర్వాత భద్రతా బలగాలు గాలించగా 12 మంది మావోల మృతదేహాలు దొరికాయి. అయితే, గరియాబాద్ డీఆర్ జీ, ఒడిశా ఎస్ ఓజీ దళాలు కూంబింగ్ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. మరణించిన మావోయిస్టులను గుర్తించే పనిలో భద్రతా సిబ్బంది ఉంది.
Read Also: Donald Trump: తనదైన మార్క్ పాలనను మొదలెట్టిన ట్రంప్.. పౌరసత్వంపై కొత్త ఉత్తర్వులు జారీ
అయితే, చనిపోయిన మావోయిస్టుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఎదురు కాల్పుల ఘటనలో ఒక జవాన్ తీవ్రంగా గాయపడగా.. అతడ్ని చికిత్స కోసం హెలికాపర్ట్ లో రాయపూర్ కు తరలించి ఆసుపత్రిలో చేర్పించి ట్రీట్మెంట్ అందిస్తున్నామని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఇంకా మావోల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. కాగా, ఈ ఏడాదిలో గరియాబంద్ జిల్లాలో ఇది రెండో ఎన్కౌంటర్. ఇప్పటి వరకు మావోయిస్టుల మరణాల సంఖ్య 28కి చేరుకుంది. గతేడాది వేర్వేరు ఎన్కౌంటర్లలో 219 మంది మావోలు చనిపోయారు.