Massive Encounter: ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని అటవీ ప్రాంతం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లిపోయింది. భద్రతా బలగాలకు.. మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో 14 మంది మావోయిస్టులు చనిపోయారు.
తెలంగాణ-ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ములుగు జిల్లా చల్పాక దగ్గర అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు.
Massive Encounter: ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు- మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు చోటు చేసుకుంది. సుమారు 10 మంది మావోలు మృతి చెందినట్లు సమాచారం.
ఛత్తీస్ఘడ్ రాష్ట్రం కంకేర్‌లో పోలీసులు, నక్సలైట్ల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరుగుతుంది. కంకేర్‌లోని ఛోటేబైథియా పోలీస్ స్టేషన్‌లోని కల్పర్ అడవుల్లో ఎన్‌కౌంటర్ జరుగుతుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో 18 మంది నక్సలైట్లు హతమైనట్లు వార్తలు వస్తున్నాయి. కాగా.. ఘటనా స్థలం నుంచి పోలీసులు ఏకే47తో పాటు ఇన్సాస్ రైఫిల్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
మహారాష్ట్ర ఏజెన్సీలో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈరోజు ఉదయం గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో సుమారు 13 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. వివరాలు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా కొట్మీ పోలీస్ స్టేషన్ పరిధిలో సీ-60 బెటాలియన్‌కు చెందిన భద్రతా బలగాలు ఎటపల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా నక్సల్స్ తారసపడి కాల్పులకు దిగారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో సుమారు 13మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా…