టాలీవుడ్ సీనియర్ హీరోలు బారీ హిట్‌లతో ధూసుకుపోతున్నప్పటికి, యంగ్ హీరోస్ మాత్రం వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్నారు. వారిలో వరుణ్ తేజ్ ఒకరు. మూడేళ్ళ నుంచి ఆయనకు ఒక్క హిట్టు సినిమా లేదు. గని, గాండీవ దారి అర్జున్, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా.. ఇలా సోలో హీరోగా వచ్చిన తన చివరి సినిమాలు, ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్ అవడంతో.. తన కెరీర్ మార్కెట్ దారుణంగా దెబ్బతింది. ముఖ్యంగా ‘మట్కా’ కొట్టిన దెబ్బ అలాంటిలాంటిది కాదు.. ఈ చిత్రానికి మినిమం ఓపెనింగ్ కూడా రాలేదు. అయినప్పటికి వరుణ్ వెనకడుగు మాత్రం వేయడం లేదు. తాజాగా ఆయన పుట్టిన రోజు సందర్భంగా (జనవరి 19న) మరో క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు, ‘మట్కా’ మూవీలో నేషనల్ టచ్ ఇచ్చిన వరుణ్ ఈసారి ఇంటర్నేషనల్ టచ్ ఇవ్వనున్నాడు.
అయితే వరుణ్ కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో మనం ‘ఎఫ్2’ ‘ఎఫ్3‘ మూవీస్ లో చూశాం. దీం తర్వాత వరుసగా సీరియస్ సినిమాలు చేసి ఎదురు దెబ్బలు తిన్న వరుణ్, ఈ మూవీతో మరోసారి కామెడీ ట్రై చేయబోతున్నాడట.మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో సాగనుంది. క్రిష్ కుటుంబ సంస్థ అయిన ‘ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్’ ఈ చిత్రంలో భాగం కానుందట. ఇక ఈ మూవీ కనుక హిట్ అయితే వరుణ్ కెరీర్ ఓ గాడిన పడుతుంది.