Marital Torture: భార్యలను భర్తలు టార్చర్ చేసిన ఘటనలు ఎన్నో చూశాం. ఇటీవలి కాలంలో సీన్ రివర్స్ అవుతోంది. భార్యలే భర్తలను టార్చర్ చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. భర్తలను వేధించడం మాత్రమే కాదు..కొంత మంది తెగించి కడతేర్చుతున్నారు.. మరికొంత మంది భర్తలే ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఘటనే పెద్దపల్లి జిల్లాలో జరిగింది. నటుడు, జానపద గాయకుడిగా రాణిస్తున్న గడ్డం రాజు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అతని పేరు గడ్డం రాజు. పెద్దపల్లి…
గోల్నాకకు చెందిన భవాని అనే మహిళా, భర్తతో గొడవపడి సరూర్నగర్ మినీ ట్యాంక్ బండ్‌లో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. గత రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి.
హీరో ధర్మ మహేష్ భార్య, ప్రముఖ యూట్యూబర్ గౌతమి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెల్లడించింది. ఆమె ఆరోపణల ప్రకారం, ధర్మ మహేష్ సినిమాల్లో హీరోగా ఉన్నప్పటికీ నిజ జీవితంలో తన భార్యపై విలన్ లా ప్రవర్తిస్తున్నాడు. ప్రతిరోజూ అర్ధరాత్రి వరకు ఇతర అమ్మాయిలతో సమయాన్ని గడిపి, ఆమెను నిరంతరం బెదిరించేవాడని గౌతమి చెప్పింది. Also Read : Kriti Sanon : ‘కాక్‌టెయిల్ 2’లో కృతి సనన్ స్పెషల్ ఎంట్రీ! గర్భవతిగా ఉన్న సమయంలో కూడా…
ఒకప్పుడు భర్తల వేధింపులు భరించలేక భార్యలు ఆత్మహత్యలకు పాల్పడేవారు. తర్వాత కట్నం వేదింపులకు మహిళలు బలయ్యేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. భార్య వేదింపులు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కొంత మంది భర్తలు. సరిగ్గా గుంటూరు జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఈ ఫొటోలో కనిపిస్తున్న వీరి పేర్లు బ్రహ్మయ్య, కౌసల్య. వీరిద్దరూ భార్యాభర్తలు. కాపురానికి వచ్చిన మొదటి మూడు నెలలు అంతా బాగానే ఉంది. తర్వాత అత్తతో కౌసల్యకు విభేదాలు మొదలయ్యాయి. అది కాస్తా ముదిరింది.…
పెళ్లై రెండు నెలలు కూడా కాలేదు...!! భర్త వేధిస్తున్నాడని భార్య హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది ! లక్కీగా స్థానికులు కాపాడారు. ప్రాణాలతో బయటపడింది. హమ్మయ్య అనుకునేలోపు.. భార్య కేసు పెట్టిందని భర్త హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హ్యాపీగా సంసారం చేసుకోవాల్సిన జంట.. సాగర్ లో ఎందుకు దూకింది. పచ్చని సంసారంలో చిచ్చుపెట్టిందెవరు..?
Shocking Video: అత్తగారిపై అత్యంత క్రూరంగా ప్రవర్తించింది ఓ కోడలు. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళ, మహిళ తరుపు బంధువులు భర్తపై, ఆమె తల్లిపై అత్యంత దారుణంగా దాడి చేశారు. వృద్ధురాలు అని చూడకుండా కోడలు, తన అత్తని జట్టు పట్టి లాగి దాడి చేసింది. తన అత్త వృద్ధాశ్రమానికి వెళ్లేందుకు నిరాకరించినందుకు కోడలు ఈ దాడికి పాల్పడింది. దీనికి సంబంధించిన విజువల్స్ ఏప్రిల్ 4న…
బెంగళూరు దక్షిణ ప్రాంతంలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. హుళిమావు సమీపంలోని దొడ్డకమ్మనహళ్లికి చెందిన రాకేశ్ అనే వ్యక్తి తన భార్య గౌరి అనిల్ సాంబెకర్ (31)ను కిరాతకంగా కడతేర్చిన విషయం తెలిసిందే. ఈ హత్య అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి సూట్‌కేసులో నింపేశాడు. మొదట్లో ఈ ఘటన అనుకోకుండా జరిగిందని అందరూ అభిప్రాయపడ్డారు. కానీ దర్యాప్తులో ఇది పక్కా ప్లాన్‌తో చేసిన హత్య అని తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. నలుగురు పిల్లలను దారుణంగా చంపిన తర్వాత తండ్రి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల కారణంగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఫోరెన్సిక్ బృందంతో సహా భారీ పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. తండ్రి తన నలుగురు అమాయక పిల్లల గొంతు కోసి చంపి.. ఆ తర్వాత అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.
భారత కబడ్డీ టీమ్ మాజీ ప్లేయర్ దీపక్ నివాస్ హుడా, అతని భార్య భారత దిగ్గజ బాక్సర్ స్వీటీ బూరా మధ్య కొంతకాలంగా మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. దీపక్ తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ స్వీటీబూరా పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఈ క్రమంలో పెద్దల సమక్షంలో చర్చలు జరుగుతుండగా అసహనానికి గురైన స్వీటీబూరా దీపక్ గళ్లా పట్టుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
భార్య కాపురానికి రావడం లేదని.. తల్లిదండ్రులపై కొడుకు కత్తితో దాడి చేసిన ఏపీలోని అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాజంపేట (మం) బలిజపల్లి పూసల కాలనీలో బుధవారం తెల్లవారుజామున తల్లిదండ్రులపై కుమారుడు కత్తితో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు.