Karnataka: కర్ణాటక రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామాలు.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు..
- కర్ణాటకలో ప్రభుత్వం ఉందా..?
- త్వరలో కీలక రాజకీయ పరిణామాలు..
- కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆ పార్టీపై అసంతృప్తి..
- మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: రానున్న రోజుల్లో కర్ణాటకలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని బీజేపీ నేత, మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై గురువారం అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీ నేతలకు వ్యతిరేకంగా మారారని ఆరోపించారు. ఎమ్మెల్యేలకు నిధులు లేవని, ప్రజల్ని ఎదుర్కొనేందుకు వారు సిగ్గుపడుతున్నారని చెప్పారు. పరిపాలన అధ్వాన్నంగా ఉందని, అధికారులు ప్రభుత్వం మాట వినడం లేదని, రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే స్థాయికి చేరిందని బొమ్మై అన్నారు.
Read Also: NEET: “హై-లెవల్ కమిటీ ఏర్పాటు, దోషుల్ని వదిలేది లేదు”.. పేపర్ లీక్‌లపై కేంద్రమంత్రి..
Also Read
- LK Advani Health Update: ఐసీయూలో మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ.. హెల్త్ బులిటిన్ విడుదల..
- Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. భారత్‌లోనూ ప్రకంపనలు
- Noida: ప్రాణం తీసిన మ్యాగీ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
- DDA Karmayogi Awas Yojana: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఫ్లాట్లపై 25 శాతం డిస్కౌంట్.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే..!
రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మె్ల్యేలలో అసంతృప్తికి సంబంధించి బీజేపీ ఎంపీ గోవిండ్ కార్జోల్ చేసిన వ్యాఖ్యలు నిజంగా ఉన్నాయని, కార్జోల్ సీనియర్ నేత అని, అతను పూర్తి సమాచారంతో మాట్లాడుతారని మాజీ సీఎం అన్నారు. రాష్ట్రంలో పెట్రోల్ ధరల పెంపుపై దావణగెరెలో జరిగిన భారీ నిరసన కార్యక్రమంలో బొమ్మై పాల్గొన్నారు. కాంగ్రెస్ ధరల పెంపుతో సమాన్య ప్రజలు, పేదలపై భారం పడుతుందని అన్నారు. పెట్రోలు, డీజిల్, ఇతర నిత్యావసరాల ధరలు పెంచడం ద్వారా పాలించే నైతిక అధికారాన్ని కోల్పోయారని, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నుంచి పేద, సామాన్య ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని బొమ్మై ఆరోపించారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కారణమైందని, కర్ణాటకని పదేళ్లు వెనక్కి నెట్టిందని ఆరోపించారు. ఓట్లు దండుకోవడానికి ప్రభుత్వం హామీల పేరుతో పేదలపై భారం మోపిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై రూ. 1.05 లక్షల కోట్ల అప్పుల భారం మోపిందని చెప్పారు. మొదట్లో మోటార్ పన్ను, మద్యం పన్ను, స్టాంపు డ్యూటీ పన్ను పెంచిందని, ఇప్పుడు పెట్రోల్, డిజిల్ ధరల్ని పెంచిందని అన్నారు.
తాజావార్తలు
-
LK Advani Health Update: ఐసీయూలో మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ.. హెల్త్ బులిటిన్ విడుదల..
-
Naga Vamsi : భారీ రేట్లు చూసి భయపడ్డా కానీ దసరాకే లాభాల పంట.. నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Deva : రజనీ బాషా మ్యూజిక్ డైరెక్టర్ మృతి
-
TGSPDCL: తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఇంట్లో కరెంట్‌ను సేవ్ చేయండి..
-
Katie Zacharia: ట్రంప్‌తో పని చేయడం గౌరవంగా ఉంది.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా తొలగింపుపై జకారియా కీలక పోస్ట్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!