NEET: “హై-లెవల్ కమిటీ ఏర్పాటు, దోషుల్ని వదిలేది లేదు”.. పేపర్ లీక్‌లపై కేంద్రమంత్రి..
- నీట్ యూజీసీ-నెట్‌పై స్పందించిన కేంద్రం..
- హై లెవల్ కమిటీ ఏర్పాటు..
- దోషుల్ని వదిలేది లేదు..
- విద్యార్థుల కెరీర్‌ని తాకట్టు పెట్టలేం..
- కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET: నీట్ అవకతవకలు, యూజీసీ-నెట్ పరీక్షల రద్దుపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్రం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం చెప్పారు. విద్యార్థుల ప్రయోజనాలే తమ ప్రథమ ప్రాధాన్యత అని చెప్పారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించిన పరీక్షలకు 30 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఆ తర్వాత నీట్ అవకతవకలు, యూజీసీ-నెట్ వ్యవహారం వెలుగులోకి వచ్చాయి. దీంతో ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ ఈ అంశంపై ఈ రోజు నిరసనలు తెలిపింది. పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ యూత్ వింగ్ ఆందోళన నిర్వహించిన తర్వాత కేంద్రమంత్రి నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
గురువారం ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. ‘‘విద్యార్థుల ప్రయోజనాలకు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, తాను హామీ ఇస్తున్నాను. పారదర్శకతలో రాజీపడము. నీట్ పరీక్షకు సంబంధించినంతవరకు మేము బీహార్ ప్రభుత్వంతో టచ్‌లో ఉన్నాము. ప్రాథమిక సమచారం ప్రకారం పాట్నా పోలీసులు మాకు వివరణాత్మక నివేదిక పంపుతారు. అవకతవకలు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి.’’ అని అన్నారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
Read Also: Tata Nexon CNG Launch: లాంచింగ్‌కి సిద్ధమవుతున్న టాటా నెక్సాన్ CNG.. బ్రెజ్జాతో పోటీ..
ఖచ్చితమైన సాక్ష్యాలు లభించిన తర్వాత, దోషుల్ని ఎవ్వర్ని వదిలిపెట్టబోమని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. దీని వెనక ఎన్‌టీఏలో సీనియర్ అధికారులు ఉన్నా విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. తమ ప్రాధాన్యత విద్యార్థుల భవిష్యత్తు అని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ NTA యొక్క నిర్మాణం, దాని పనితీరు, పరీక్ష ప్రక్రియ, పారదర్శకత మరియు డేటా మరియు భద్రతా ప్రోటోకాల్‌ను మెరుగుపరచడంపై సిఫార్సులను ఇస్తుందని చెప్పారు.
పబ్లిక్ పరీక్షల్లో అన్యాయం జరగకుండా ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిందని, ఇలాంటి అంశాలపై పుకార్లు పుట్టించవద్దని, రాజకీయం చేయవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.లక్షలాది మంది విద్యార్థులు, వారిలో చాలా మంది పేదవారు లేదా గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన అభ్యర్థులు మంచి మార్కులు సాధించారని, మంచి ర్యాంకులు పొందారని చెప్పారు. వారి కెరీర్‌ని తాకట్టలు పెట్టలేమని, ఒక చోట జరిగిన అవకతవకలతో మొత్తం విద్యార్థుల కెరీర్‌ని పణంగా పెట్టలేమని చెప్పారు.
#WATCH | On UGC-NET exam cancellation, Union Education Minister Dharmendra Pradhan says, "…Paper leak is an institutional failure of NTA. We are assuring you that there will be a reform committee and action will be taken…" pic.twitter.com/zwBzqD2Eba
— ANI (@ANI) June 20, 2024
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..