2022 -23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి లాభాల వాటాలో 32 శాతం ఉద్యోగులకు స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా సింగరేణి ఉద్యోగులకు 700 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ ఇచ్చేందుకు యాజమాన్యం నిర్ణయించుకుంది. ఇక, సింగరేణి కార్మికులకు యాజమాన్యం శుభవార్త చెప్పింది. 11వ వేజ్ బోర్డు బకాయిలు రూ.1450 కోట్లు సింగరేణి కార్మికుల ఖాతాల్లో జమ కావడంతో కార్మికుల కళ్లలో ఆనందం నింగికి ఎగిసింది. తెలంగాణ సర్కార్ చెప్పినట్టే వారి ఖాతాల్లో డబ్బులు జమ కావడంతో సింగరేణి కార్మికుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ మేరకు సింగరేణి డైరెక్టర్ (ఫైనాన్స్) ఎన్.బలరాం నిర్ణయం తీసుకున్నారు. ఇంత పెద్ద మొత్తం ఒకేసారి చెల్లించడం సింగరేణి చరిత్రలో ఇదే తొలిసారి అని తెలిపారు.
Read Also: Waheeda Rehman: సీనియర్ నటికి అరుదైన గౌరవం
ఆదాయపు పన్ను, సీఎంపీఎఫ్‌లో జమ చేయాల్సిన మొత్తం మినహా మిగిలిన మొత్తాన్ని కార్మికుల ఖాతాల్లో జమ చేశారు. అంతేకాదు, త్వరలో దసరా పండుగలోపు లాభాల వాటాతో పాటు దీపావళి బోనస్‌ను చెల్లించడానికి సిద్ధంగా ఉంది. సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.700 కోట్ల లాభాల బోనస్ ను దసరా లోపు చెల్లించేందుకు ఏర్పాట్లు చేశామని బలరాం ప్రకటించారు. దీపావళి బోనస్ పీఎల్ ఆర్ ముందుగానే చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని.. బకాయిలు, బోనస్ చెల్లింపులపై కొందరు అనవసర అపోహలు సృష్టిస్తున్నారని, వాటిని కార్మికులు నమ్మవద్దని కోరారు. బకాయిలు, బోనస్‌ల చెల్లింపునకు ఏర్పాట్లు చేస్తుంది. పెద్ద మొత్తంలో బకాయిలు పొందిన కార్మికులు ఈ సొమ్మును పొదుపుగా వినియోగించి తమ కుటుంబాల భవిష్యత్తుకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Read Also: India-Canada: “ఉగ్రవాదులకు స్వర్గధామంగా కెనడా”.. భారత్‌కి మద్దతుగా శ్రీలంక, బంగ్లాదేశ్
సింగరేణి సంస్థ కార్మికుల సంక్షేమం కోసం పాటుపడుతుందని, ఉద్యోగులు కూడా తమ పనివేళలను సద్వినియోగం చేసుకుని సంస్థ అభివృద్ధికి పాటుపడాలన్నారు. వారు కూడా మరిన్ని ప్రయోజనాలు, సంక్షేమం పొందాలని కోరారు. ఈ వేతన బకాయిలు పొందిన వారిలో రామగుండం-1 ఏరియా హెడ్ ఓవర్‌మెన్ వేముల సుదర్శన్ రెడ్డి సింగరేణి టాపర్‌గా నిలిచారు. 9.91 లక్షలు మొదటి స్థానంలో ఉండగా.. రామగుండం-2 ప్రాంతానికి చెందిన ఈఐపీ ఆపరేటర్ మీర్జా ఉస్మాన్ బేగ్ రెండో స్థానంలో రూ. 9.35 లక్షలు, మూడో స్థానంలో రూ. 9.16 లక్షలతో శ్రీరాంపూర్ ఏరియా హెడ్ ఓవర్‌మెన్ ఆడెపు రాజమల్లు. సింగరేణి భవన్‌లో అత్యధిక బకాయిలు పొందిన లచ్చయ్య (రూ. 6.97 లక్షలు), రవిబాబు (రూ. 6.81 లక్షలు), సత్యనారాయణరెడ్డి (రూ. 6.69 లక్షలు)లకు డైరెక్టర్ బలరాం, జీఎం సురేష్ చెక్కులను అందించారు. బకాయిలు అందడమే కాకుండా.. దసరా పండుగలోపు లాభాల వాటాతో పాటు దీపావళి బోనస్ కూడా ఇస్తామని చెప్పడంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు.