పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ పట్టుబడ్డ హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని పోలీసులు పేర్కొన్నారు. శనివారం ఆమెను అరెస్ట్ చేయగా.. న్యాయస్థానం ఆమెను ఐదు రోజులు కస్టడీకి ఇచ్చింది. దీంతో అధికారులు వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు.