INDIA bloc: ప్రతిపక్ష ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీని అధికారం నుంచి దించేందుకు కాంగ్రెస్, ఆప్, టీఎంసీ, ఆర్జేడీ పలు పార్టీలతో ఇండియా కూటమి ఏర్పడింది. అయితే, ప్రస్తుతం ఆ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వెళ్తున్నారు. ఇప్పటికే, ఇండియా కూటమి రూపశిల్పిగా పేరున్న సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీతో పొత్తును కాదని, ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పి మళ్లీ బీజేపీతో దోస్తీ కట్టారు. ఇక టీఎంసీ చీఫ్,…
Tejashwi Yadav: బీహార్‌లో మరోసారి బీజేపీ-జేడీయూ ప్రభుత్వం కొలువదీరబోతోంది. ఆర్జేడీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత మళ్లీ ఎన్డీయే కూటమిలోకి సీఎం నితీష్ కుమార్ చేరిపోయారు. ఈ రోజు సాయంత్రం బీజేపీ మద్దతుతో సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. బీజేపీ నుంచి ఇద్దరు ఉపముఖ్యమంత్రులు ఉండబోతున్నారు. ఇదిలా ఉంటే మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ ముఖ్యనేత, లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో తొలిసారిగా మాట్లాడారు.