Onion Export: సార్వత్రిక ఎన్నికల ముందు ఇటీవల కేంద్రం ఉల్లి ఎగుమతులపై కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ఎగుమతులపై నిరవధికంగా నిషేధాన్ని పొడగించింది. వరసగా రెండేళ్లలుగా ఉల్లిపాయల పంట దిగుబడి తక్కువగా ఉంటుందనే వార్తల నేపథ్యంలో.. ప్రజలకు అందుబాటులో ఉండేలా చేసేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. గతేడాది డిసెంబర్ నెలలో ఉల్లిపై కేంద్రం ఆంక్షలు విధించింది. ఇది మార్చి 31 వరకు కొనసాగుతుందని చెప్పింది. అయితే, ఈ తేదీ రాకుముందే నిరవధికంగా నిషేధాన్ని పొడగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Read Also: Congress: కాంగ్రెస్ కీలక నిర్ణయం..! అమేథీలో స్మృతి ఇరానీపై పోటీ చేసేదెవరంటే..!
ప్రపంచంలోనే అతిపెద్ద ఉల్లి ఎగుమతి చేసే దేశంగా ఉన్న భారత్, పలు దేశాల దౌత్యపరమైన అభ్యర్థన తర్వాత ఎగుమతికి అనుమతించింది. బంగ్లాదేశ్‌కు 50,000 టన్నులు, భూటాన్‌కు 550 టన్నులు, బహ్రెయిన్‌కు 3,000 టన్నులు, మారిషస్‌కు 1,200 టన్నులు, యుఎఇకి 14,400 టన్నుల ఎగుమతులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
2023-24లో భారతదేశం యొక్క రబీ (శీతాకాలంలో పెరిగిన) ఉల్లి ఉత్పత్తి 19.3 మిలియన్ టన్నులుగా అంచనా వేయబడింది, ఇది మునుపటి సీజన్‌లో 23.6 మిలియన్ టన్నుల కంటే దాదాపు 18 శాతం తక్కువగా ఉంది. ఉల్లిపాయల వార్షిక ఉత్పత్తిలో రబీలోనే 72-75 శాతం పంట వస్తుంది. 2024-25లో 500,000 టన్నుల అత్యవసర నిల్వల కోసం ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి మార్కెట్ ధరలకు రైతుల నుండి ఉల్లిపాయలను సేకరించడం ప్రారంభించింది. ఈ బఫర్ స్టాక్ ఉల్లి ధరలను స్థిరీకరించడానికి ఉపయోగపడుతుంది. గతేడాది పెరుగుతున్న ఉల్లిధరల్ని నియంత్రించడానికి సుమారు 6,00,000 టన్నులను కొనుగోలు చేసి సబ్సిడీ ధరలకు విక్రయించింది.