Pahalgam Attack: జమ్మూ కాశ్మీర్ వివాదాన్ని అంతర్జాతీయ స్థాయిలో తెలియజేసేందుకే విదేశీ అతిథుల భారత పర్యటనలో ఉండగానే ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి.
రెండు నెలల క్రితమే పెళ్లైంది. సంసారం ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. దంపత్య జీవితాన్ని ఆ జంట ఆస్వాదిస్తోంది. భార్యతో కలిసి అలా సరదాగా గడిపేందుకు టూర్ ప్లాన్ చేశారు. హనీమూన్‌కు కాశ్మీర్ అయితే బాగుంటుందని భావించారు.
Donald Trump : జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడిపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కష్టసమయంలో అందరూ భారత్ కు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ ప్రకటించింది. ‘ట్రంప్ మోడీకి ఫోన్ చేసి మద్దతు ప్రకటించారు. ఉగ్రదాడిన తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి పాల్పడిన వారిని శిక్షించేందుకు భారత్ కు సంపూర్ణ…
పోలవరం ప్రాజెక్టును కూటమి ప్రభుత్వమే పూర్తి చేస్తుంది.. ఏలూరు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా పారదర్శకమైన రేషన్ విధానాన్ని అమలు చేస్తున్నాం అని తేల్చి చెప్పారు. కానీ, గత వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో రేషన్ మాఫియా విచ్చలవిడిగా కొనసాగింది అని ఆరోపించారు. ఇప్పుడు, రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితిని చక్కబెడుతున్నాం…
Pakistan: పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్ కాల్పులతో దద్దరిల్లుతోంది. ఉగ్రవాదులకు, సైన్యానికి జరిగిన ఘర్షణల్లో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. ఈ ఘర్షణల్లో 18 మంది భద్రతా సిబ్బంది, 12 మంది ఉగ్రవాదులు మరణించినట్లుగా తెలుస్తోంది. జనవరి 31-ఫిబ్రవరి 1 రాత్రి సమయంలో ప్రావిన్స్‌లోని కలాట్ జిల్లాలోని మంగోచార్ ప్రాంతంలో రోడ్డుని ఉగ్రవాదులు దిగ్భందించడంతో ఈ సంఘటన జరిగిందని పాక్ సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది.
Terrorist Attack: 2025 జనవరి 25న, జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో గణతంత్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందు ఉగ్రవాద ఘటన చోటుచేసుకుంది. బిల్వార్ ప్రాంతంలోని భటోడి, మువార్ ప్రాంతంలోని ఆర్మీ క్యాంపుపై అర్థరాత్రి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అయితే, సైన్యం ఎదుకాల్పులు చేసింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో సైన్యం చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ సంఘటనతో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) అదనపు డైరెక్టర్ జనరల్…
అగ్ర రాజ్యం అమెరికాలో నూతన సంవత్సరం రోజున జరిగిన ఉగ్ర దాడిని ప్రధాని మోడీ ఖండించారు. న్యూ ఓర్లీన్స్‌లో ఒక పికప్ ట్రక్కు అత్యంత వేగంగా జనాలపైకి దూసుకొచ్చింది.
Terrorist Attack: పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఉగ్రదాడి ఘటన చోటు చేసుకుంది. ఈ ఉగ్రదాడిలో 50 మంది మరణించినట్లు సమాచారం అందుతోంది. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని డౌన్ కుర్రం ప్రాంతంలో ప్రయాణీకుల వ్యాన్‌పై ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఓ పోలీసు అధికారి, మహిళలు సహా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. అందిన నివేదిక ప్రకారం.. ఈ దాడిలో 50 మంది మరణించారు. దిగువ కుర్రంలోని ఓచుట్ కలి, మండూరి సమీపంలో ప్యాసింజర్ వ్యాన్ వెళ్లగానే…
శ్రీనగర్‌లో జరిగిన ఉగ్రదాడిపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓ ప్రకటన చేశారు. ఈ సంఘటన దురదృష్టకరమని అభివర్ణిస్తూ.. తన సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. "గత కొన్ని రోజులుగా లోయలోని కొన్ని ప్రాంతాల్లో ఉగ్రదాడులు & ఎన్‌కౌంటర్‌లు ఎక్కువగా జరుగుతన్నాయి. శ్రీనగర్‌లోని 'సండే మార్కెట్' వద్ద అమాయక దుకాణదారులపై గ్రెనేడ్ దాడికి సంబంధించిన ఈరోజు వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో ఆదివారం గ్రెనేడ్ దాడి జరిగింది. ప్రధాన శ్రీనగర్‌లోని టీఆర్‌సీ కార్యాలయం సమీపంలోని ఆదివారం మార్కెట్‌లో ఈ దాడి జరిగింది. మార్కెట్‌లో ఉన్న జనం ఈ పేలుడులో 10 మంది గాయపడినట్లు సమాచారం. ఒక రోజు ముందు, ఖన్యార్‌లో సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే.