Karnataka: డబ్బాలో డబ్బు.. తీసి చూస్తే ఉప్పు.. ఏం ఐడియా సర్ జీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: మాటలతో మయా చేస్తూ ప్రజలను మభ్యపెట్టి దొరికినకాడికి దోచుకుంటున్నారు కేటుగాళ్లు.. తెలిసిన వాళ్ళనైనా, సొంత బంధువులనైనా సరే గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకంటే ఎవరి మనసులో ఏముందో ఎవరికీ తెలియదు.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందవచ్చు అని నమ్మబలికి కేటుగాళ్లు ప్రజలను మోసం చేసిన ఘటనలు గతంలో కోకొల్లలు. అలాంటి ఘటనే తాజాగా కర్ణాటకలో చోటు చేసుకుంది. డబ్బాలో ఉప్పు పెట్టి డబ్బులు ఉన్నాయని మోసం చేస్తూ పడ్డుబడ్డాడు ఓ వ్యక్తి.. వివరాలలోకి వెళ్తే.. తిప్పూరు నగరానికి చెందిన బాబా అనే వ్యక్తికి ప్రముఖులతో, రాజకీయ నాయకులతో మంచి స్నేహసంబంధాలు ఉన్నాయి. దీనితో ఆయనకు ఉన్న పలుకుబడిని ప్రజలను మోసం చేయడానికి వినియోగించారు. తక్కువ వడ్డీకి డబ్బులు ఇపిస్తానని చెప్పి కోట్ల రూపాయలు స్వాహా చేశారు. ఇతను అప్పు తీసుకునే వ్యక్తికి అప్పు ఇచ్చేవ్యక్తికి మధ్య మధ్యవర్తిగా వ్యవహరించేవాడు.
Read also:Vizag Steel Plant: విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ.. ఉక్కు ఉద్యమానికి 1000 రోజులు
Also Read
కాగా అప్పు కావాల్సిన వ్యక్తికి డబ్బులు అందిస్తాను అని చెప్పి ఫైనాషియర్ దగ్గర డబ్బులు తీసుకునే వాడు.అనంతరం ఓ డబ్బాని ఉప్పు కాగితాలతో నింపి పైన కొన్ని కరెన్సీ నోట్లు పెట్టి అప్పు తీసుకునే వ్యక్తులని మోసం చేసాడు. తాజాగా గిరీష్ అనే వ్యక్తికి తక్కువ వడ్డీకి రూ/ కోటి రుణం ఇప్పిస్తానని చెప్పాడు. అలానే రూ/2.5 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. అలానే రాజేష్ జాతవ్ అనే అతనికి కూడా ఇలానే చెప్పి రూ/ 30 వేలు అడ్వాన్స్ ఇచ్చారు . కాగా మిగిలిన డబులు శివమొగ్గ రైల్వే స్టేషన్ దగ్గర ఇస్తాను అని చెప్పారు. ఈ నేపథ్యంలో గిరీష్, రాజేష్ జాతవ్ శివమొగ్గ రైల్వే స్టేషన్‌కు వచ్చారు. కాగా వాళ్లకు బాబా ఉప్పు, కాగితం, డబ్బుతో నింపిన రెండు పెట్టెలు తెచ్చి ఇద్దరికి ఇచ్చి ఒక్కో బాక్స్ లో కోటి రూపాయలు ఉన్నాయని చెప్పారు.
Read also:South Central Railway: ట్రైన్లలో టపాసులు తీసుకెళ్తే జైలు శిక్ష.. సౌత్ సెంట్రల్ రైల్వే హెచ్చరిక
గిరీష్, రాజేష్ అక్కడే బాక్స్ ఓపెన్ చేసి చూడగా పైన కరెన్సీ నోట్లు ఉన్నాయి. దానితో వాళ్లకు ఎలాంటి అనుమానం రాలేదు. అయితే తరువాత మొత్తం తీసి చూడగా ఇద్దరు కంగుతిన్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు బాబాను ఆ బాక్స్ లు రైల్వే స్టేషన్ కి తెచ్చిన బాబా డ్రైవర్ జబీవుల్లాను అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!