Prahlad Joshi: ప్రధాని నమ్మకానికి కృతజ్ఞతలు.. బాధ్యతాయుతంగా పనిచేస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prahlad Joshi: నీట్ పేపర్ లీక్ వివాదం, విద్యార్థుల వరుస ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామా అనంతరం ఆ మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికు అప్పగించిన విషయం విదితమే. ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ బాధ్యతలను జోషికి అప్పగించారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ప్రధాని తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. వినయం, అత్యంత బాధ్యతాయుతమైన ధోరణితో తన విధులు నిర్వహిస్తానని స్పష్టం చేశారు. గడిచిన 4-5 ఏళ్లలో ధర్మేంద్ర ప్రధాన్ జాతీయ విద్యా విధానాన్ని (NEP) సమర్థవంతంగా అమలు చేస్తూ విద్యాశాఖలో అనేక సంస్కరణలు తెచ్చారని కొనియాడారు. ప్రస్తుతం ధార్వాడ్ (కర్ణాటక) లోక్‌సభ ఎంపీగా ఉన్న 63 ఏళ్ల ప్రహ్లాద్ జోషి, తన వద్ద ఉన్న వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖల బాధ్యతలతో పాటు అదనంగా విద్యాశాఖను నిర్వర్తించనున్నారు.
మరోవైపు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు నిరసనకారులు, నిర్వాహకులపై నమోదైన FIRలను ఉపసంహరించుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గడచిన 49 రోజులుగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) నిర్వహిస్తున్న ఆందోళన ముగిసింది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో CJP ప్రతినిధి బృందం మూడు విడతలుగా జరిపిన చర్చలు ఫలించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అనుకున్న సమయానికి నెరవేరుస్తుందనే నమ్మకంతోనే ఈ నిరసనలను విరమిస్తున్నట్లు సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ప్రకటించారు.
Also Read
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
- LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
తాజావార్తలు
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
-
Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
-
El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!