Bangladesh: 50 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌కి పాకిస్తాన్ సైన్యం.. భారత్‌కి ముప్పు..
- 50 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌కి పాకిస్తాన్ సైన్యం..
- బంగ్లాదేశ్ సైన్యానికి శిక్షణ ఇవ్వనున్న పాక్ ఆర్మీ..
- బంగ్లాలో పెరుగుతున్న భారత వ్యతిరేకత..
- రానున్న రోజుల్లో ముప్పుగా మారే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: పాకిస్తాన్ సైన్యం అరాచకాల నుంచి రక్షించి బంగ్లాదేశ్ ఏర్పాటుకు సహకరించిన భారత్ ఇప్పుడు, ఆ దేశానికి శత్రువుగా మారింది. అనేక అరాచకాలు చేసిన పాకిస్తాన్, ఇప్పుడు బంగ్లాదేశ్‌కి స్నేహితుడయ్యాడు. ఎప్పుడైతే షేక్ హసీనా పదవీ నుంచి దించేసి, మహ్మద్ యూనస్ అధికారం చేపట్టాడో అప్పటి నుంచి బంగ్లా వ్యాప్తంగా భారత వ్యతిరేకత నానాటికి పెరుగుతోంది. హిందువులపై అరాచకాలు చేస్తూ, మరో పాకిస్తాన్‌గా మారేందుకు బంగ్లాదేశ్ సిద్ధమవుతోంది.
ఇదిలా ఉంటే, దాదాపుగా 50 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశ్‌లోకి అడుగుపెడుతోంది. ఈ పరిణామం భారత్‌కి ఆందోళనకరం. ఇటీవల కాలంలో అన్నీ మరిచిపోయి బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లు స్నేహాన్ని పెంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 2025 నాటికి, పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశ్ సైన్యానికి శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. 1971 లిబరేషన్ వార్ తర్వాత బంగ్లాదేశ్ సైనికులకు శిక్షణ ఇచ్చేందుకు పాకిస్తాన్ సైన్యంతో ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే తొలిసారి.
Also Read
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
- PM Modi: "2047 నాటికి 'వికసిత భారతే లక్ష్యం.. We Will Do It.." దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
పాకిస్తాన్‌తో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ సైన్యాల మధ్య సహకారం కోసం ఒప్పందం కుదిరినట్లు నివేదికలు చెబుతున్నాయి. బంగ్లాదేశ్‌లోని మైమెన్సింగ్ కంటోన్మెంట్ నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది. నాలుగు కంటోన్మెంట్లలో కూడా పాక్ ఆర్మీ శిక్షణ ఇవ్వబోతోంది.
Read Also: Naga Vamsi : నాగవంశీపై స్కామ్ 1992 డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
భారత్ ఆందోళన ఏమిటి..?
బంగ్లాదేశ్‌లోకి పాకిస్తాన్ చొచ్చుకువస్తోంది. గతంలో పాకిస్తాన్ నౌకలపై ఉన్న ఆంక్షలను యూనస్ ప్రభుత్వం ఎత్తేసింది. దీంతో యథేచ్చగా పాక్ నౌకలు బంగ్లాలోకి రావొచ్చు. ఇటీవల కరాచీ నుంచి చిట్టగాంగ్ రేపుకు పాక్ నుంచి కార్గో నౌకలు వచ్చాయి. ఇక బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి ఆయుధాల కొనుగోలుని వేగవంతం చేసింది.
ఇవన్నీ చూస్తే, బంగ్లాదేశ్ టార్గెట్ భారత్ అని తెలుస్తోంది. దీనికి తోడు బంగ్లాదేశ్‌లో పాక్ ప్రమేయం పెరిగితే భారత ఈశాన్య రాష్ట్రాల్లోని ఉగ్రవాద, వేర్పాటువాద శక్తులకు ఆర్థిక, ఆయుధ సాయం దక్కే ప్రమాదం ఉంది. బంగ్లాదేశ్ వ్యాప్తంగా భారత వ్యతిరేకతను పాకిస్తాన్ రెచ్చగొడుతుంది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో తిరుగుబాటుని పాక్ దాని గూఢచార సంస్థ ఐఎస్ఐ ప్రేరేపిస్తోంది. ఈ పరిణామాలు చూస్తే బంగ్లాదేశ్‌ని ఉపయోగించుకుని భారత్‌ని అస్థిరపరిచే కుట్రకు పాకిస్తాన్ తెరతీస్తోందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!