Bangladesh: 1971లో విడిపోయిన తర్వాత తొలిసారి బంగ్లాదేశ్, పాకిస్తాన్ తొలిసారిగా ప్రత్యక్ష వాణిజ్య సంబంధాలను పున:ప్రారంభించాయి. ప్రభుత్వ ఆమోదం తర్వాత మొదటి కార్గో పోర్ట్ ఖాసిం నుంచి బయలుదేరినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఫిబ్రవరి ప్రారంభంలో బంగ్లాదేశ్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ పాకిస్తాన్ (TCP) ద్వారా 50,000 టన్నుల పాకిస్తానీ బియ్యాన్ని కొనుగోలు చేయడానికి అంగీకరించడంతో ఒప్పందం కుదిరింది.
Bangladesh: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత, భారత్-బంగ్లాల మధ్య సంబంధాలు మునుపటిలా లేవు. ఆ దేశంలో ఇస్లామిక్ రాడికల్ భావజాలం, హిందువులపై దాడులు, భారత్ వ్యతిరేకత నానాటికి పెరుగుతోంది. దీనికి తోడు బంగ్లాదేశ్ ఇటీవల కాలంలో పాకిస్తాన్‌తో సంబంధాలను పెంచుకుంటోంది. ఈ పరిణామాలు భారత్‌కి ఆందోళనకరంగా మారాయి.
Bangladesh: పాకిస్తాన్ సైన్యం అరాచకాల నుంచి రక్షించి బంగ్లాదేశ్ ఏర్పాటుకు సహకరించిన భారత్ ఇప్పుడు, ఆ దేశానికి శత్రువుగా మారింది. అనేక అరాచకాలు చేసిన పాకిస్తాన్, ఇప్పుడు బంగ్లాదేశ్‌కి స్నేహితుడయ్యాడు. ఎప్పుడైతే షేక్ హసీనా పదవీ నుంచి దించేసి, మహ్మద్ యూనస్ అధికారం చేపట్టాడో అప్పటి నుంచి బంగ్లా వ్యాప్తంగా భారత వ్యతిరేకత నానాటికి పెరుగుతోంది. హిందువులపై అరాచకాలు చేస్తూ, మరో పాకిస్తాన్‌గా మారేందుకు బంగ్లాదేశ్ సిద్ధమవుతోంది.
Bangladesh: షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ ప్రభుత్వం పాకిస్తాన్‌కి చాలా దగ్గరైంది. 1971 విముక్తి ఉద్యమంలో లక్షలాది మంది బెంగాలీలను చంపిన ఉదంతాన్ని మరిచిపోయి, పాక్‌తో స్నేహం చేస్తోంది. నిజానికి బంగ్లాదేశ్ స్వాతంత్ర్యానికి కారణమైన భారత్‌ని వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతం ఆ దేశంలోని హిందూ మైనారిటీలపై మతోన్మాద మూకలు దాడులకు తెగబడుతున్నాయి. భారత్, అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న అభ్యర్థనను కూడా యూనస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పాక్-బంగ్లా చెట్టాపట్టాల్: బంగ్లాదేశ్‌లో…