Bangladesh: బంగ్లాదేశ్ మరోసారి అగ్నిగుండంగా మారింది. రాడికల్ ఇస్లామిస్ట్ విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హాది హత్య బంగ్లాలో హింసకు కారణమైంది. షేక్ హసీనాను గద్దె దించిన విద్యార్థి నేతల్లో హాది కీలకంగా వ్యవహరించాడు. ఇతడిని గుర్తుతెలియని వ్యక్తులు దగ్గర నుంచి కాల్చారు.
Bangladesh Violence: బంగ్లాదేశ్ మరోసారి హింసతో అట్టుడుకుతోంది. రాడికల్ ఇస్లామిస్ట్ విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాది హత్య తర్వాత ఆ దేశం భగ్గుమంది. రాడికల్ శక్తులు అక్కడి మీడియాతో పాటు హిందువుల్ని టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారు. మైమన్సింగ్ జిల్లాలో ఒక హిందూ కార్మికుడిని దైవదూషణ ఆరోపణలతో దారుణంగా హత్య చేశారు. ఢాకాతో పాటు చిట్టగాంగ్ సహా ఇతర అన్ని ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే, బంగ్లాలో కొత్తగా ఏర్పడిన నేషనల్ సిటిజన్స్…
Bangladesh crisis: 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం తర్వాత, ఇప్పుడు భారతదేశానికి వ్యూహాత్మక సవాల్‌గా మారుతోందని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ హెచ్చరించింది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని ప్యానెల్ బంగ్లాదేశ్‌లో రాజకీయ మార్పులు, చైనా, పాకిస్తాన్ నుంచి పెరుగుతున్న ప్రభావం,
Bangladesh: బంగ్లాదేశ్‌లో రాడికల్ గ్రూపులు ఢాకాలోని భారత హైకమిషన్‌పై దాడికి యత్నించారు. గుంపుగా వచ్చిన నిరసనకారులు బారికేడ్లను దాటుకుని రాయబార కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. వీసాల జారీ ప్రక్రియ నిలిపివేతను వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు ఎంబసీని ముట్టడించారు. గత కొన్ని రోజులుగా భారత రాయబార కార్యాలయానికి ఆ దేశంలోని పలువురు నాయకుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఢిల్లీలోని బంగ్లా రాయబారి రియాజ్ హబీబుల్లాను భారత విదేశాంగ శాఖ పిలిపించి, పరిస్థితిపై ఆందోళన…
India-Bangladesh: ఉగ్రవాదుల బెదిరింపులు, బంగ్లాదేశ్ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పెరుగుతున్న భద్రతా సమస్యల మధ్య భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం బంగ్లా రాజధాని ఢాకాలో ఉన్న ఇండియన్ వీసా దరఖాస్తు కేంద్రాన్ని (IVAC) మూసివేసింది. భద్రతా పరిస్థితిని చూసిస్తూ మధ్యాహ్నం 2 గంటల నుంచి కార్యకలాపాలను నిలిపేసింది.
India-Bangladesh: బంగ్లాదేశ్‌లో మతోన్మాదులు రెచ్చిపోతున్నారు. ఢాకాలోని భారత హైకమిషన్‌కు భద్రతా బెదిరింపులు చేశారు. అయితే, ఈ పరిణామాలపై భారత్ బంగ్లాదేశ్ హైకమిషన్ ఎం రియాజ్ హమీదుల్లాకు సమన్లు జారీ చేసింది. ఢాకాలోని భారత మిషన్‌పై దాడులు చేస్తామంటూ అక్కడ కొంతమంది తీవ్రవాద శక్తులు వ్యాఖ్యానించడంపై భారత విదేశాంగశాఖ సమన్లు జారీ చేసినట్లు తెలిపింది. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ సంఘటనలకు సంబంధించి సరైన ఆధారాలు పంచుకోకపోవడం, చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని చెప్పింది. యాదృచ్ఛికంగా, బంగ్లాదేశ్…
Bangladesh: పాకిస్తాన్ వ్యాప్తంగా గత కొంత కాలంగా ‘‘గుర్తు తెలియని వ్యక్తులు’’ భారత వ్యతిరేక ఉగ్రవాదుల్ని హతమారుస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో చనిపోయారు. హఠాత్తుగా ఒకరు, ఇద్దరు బైక్‌పై వస్తారు, తమ లక్ష్యంగా ఉన్న ఉగ్రవాది దగ్గరకు వచ్చి, గుండెల్లో బుల్లెట్లు దించి, క్షణాల్లో అక్కడ నుంచి పరారవుతుంటారు. ఇప్పటి వరకు పాకిస్తాన్ ప్రభుత్వం ఒక్క ‘‘గుర్తు తెలియని వ్యక్తి’’ని పట్టుకోలేకపోయింది. కొన్ని సందర్భాల్లో ఈ దాడుల వెనక భారత గూఢచార సంస్థ ఉందని ఆరోపిస్తోంది.
Bangladesh: భారతదేశం ముక్కలైతేనే బంగ్లాదేశ్‌కు ‘‘పూర్తి శాంతి’’ లభిస్తుందని బంగ్లాదేశ్ మాజీ ఆర్మీ జనరల్ అన్నారు.ఢాకాలోని నేషనల్ ప్రెస్ క్లబ్లో జరిగిన ఒక కార్యక్రమంలో జమాతే-ఇ-ఇస్లామీ మాజీ చీఫ్ గులాం అజామ్ కుమారుడు బ్రిగేడియర్ జనరల్ (రిటైర్డ్) అబ్దుల్లాహిల్ అమాన్ అజ్మీ ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
Sheikh Hasina: గతేడాది హింసాత్మక విద్యార్థి ఉద్యమం తర్వాత షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు. అయితే, ఈ అల్లర్లలో పలువురు మరణాలకు కారణమయ్యారని, మానవత్వానికి వ్యతిరేకంగా అనేక చర్యలకు పాల్పడ్డారని బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది. ఈ నేపథ్యంలో, హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్, భారత్‌ను కోరుతోంది.