వామ్మో.. దేశాన్ని చలిగాలులు వణికిస్తున్నాయి. మొన్నటిదాకా వర్షాలు.. ఇప్పుడేమో చలి ఠారెత్తిస్తోంది. గత కొద్దిరోజులుగా చలి తీవ్రత గజగజవణికిస్తోంది. బయటకు రావాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇక ఉదయాన్నే ఉద్యోగులకు వెళ్లేవారి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. కాళ్లు.. చేతులు వణికిపోతున్నాయి. ఎముకలు కొరికే చలితో హడలెత్తిపోతున్నారు. ఇలాంటి తరుణంలో చలి పులిపై తాజాగా కేంద్ర వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: India-US: ఎల్పీజీపై అమెరికాతో భారత్ కీలక ఒప్పందం.. ధరలు తగ్గే అవకాశం!
దేశంలో ఆయా రాష్ట్రాల్లో చలి గాలులు తీవ్రంగా ఉంటాయని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. మధ్య, పశ్చిమ భారతదేశంలో తీవ్రమైన పరిస్థితులు ఉంటాయని హెచ్చరించింది. మధ్యప్రదేశ్‌లో చాలా తీవ్రంగా ఉంటుందని.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇక దక్షిణాదిలో వర్షాలతో పాటు చలి గాలులు కూడా ఉంటాయని తెలిపింది. రాబోయే రోజుల్లో దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో తీవ్ర పరిణామాలు తీవ్రంగా ఉంటాయని.. విపరీతమైన చలిగాలులు ఉంటాయని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Delhi Car Blast: బ్లాస్ట్‌కు ముందు 2 కీలక ఫోన్లు మిస్సింగ్.. ఉమర్ ఎవరికిచ్చాడు? పూర్తి డేటా వచ్చేసింది
మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్‌లో నవంబర్ 17 నుంచి 19 మధ్య ఉష్ణోగ్రతలు చాలా దారుణంగా పడిపోతాయని పేర్కొంది. ఇక సోమవారం పశ్చిమ మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 6 డిగ్రీలు నమోదైంది. దేశంలోనే అత్యంత చలి ప్రాంతం ఇదేనని తెలిపింది. ఇక ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, గుజరాత్‌లో కూడా తీవ్ర పరిస్థితులు ఉంటాయని చెప్పింది.
ఇక దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయని వెల్లడించింది. తమిళనాడు, కేరళ, కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ, అండమాన్ మరియు నికోబార్ దీవులలో తేలికపాటి నుంచి మితమైన వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది నవంబర్ 18 నుంచి 22 వరకు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని.. నవంబర్ 17న అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.. నవంబర్ 20 వరకు తమిళనాడు, కేరళ, మాహే, కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక తెలంగాణలో కూడా చలి గాలులు ఎక్కువగా ఉంటాయని తెలిపింది.
ఇక నవంబర్ 17న కొన్ని ప్రాంతాల్లో గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, నవంబర్ 18న అండమాన్ సముద్రం మీదుగా గాలులు గంటకు 60 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.