Chandigarh Mayoral Poll: చండీగఢ్ మేయర్ ఎన్నికకు ముందే కాంగ్రెస్‌కి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ కౌన్సిలర్ గుర్బక్ష్ రావత్ బీజేపీలో చేరడంతో హస్తం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌కి మొత్తం 7 మంది కౌన్సిలర్లు ఉండగా, ఇప్పుడు ఆ పార్టీకి ఆరుగురు కౌన్సిలర్లు మాత్రమే మిగిలిపోయారు. బీజేపీ కౌన్సిలర్ల సంఖ్య 16కి పెరిగింది. చండీగఢ్ లోని బీజేపీ కార్యాలయంలో, చండీగఢ్ బీజేపీ అధ్యక్షుడు జతీందర్ పాల్ మల్హోత్రా, పార్టీ సీనియర్ల సమక్షంలో రావత్ బీజేపీలో చేరారు.
చండీగఢ్ ఉదంతంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme court) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మేయర్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారంటూ రిట్నరింగ్ అధికారిని ఉద్దేశిస్తూ ధర్మాసనం సంచలన వ్యా్ఖ్యలు చేసింది.
Arvind Kejriwal: చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు అన్యాయమని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆరోపిస్తోంది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఈ రోజు ఆప్ నిరసనకు పిలుపునిచ్చింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ రిగ్గింగ్ చేసి గెలుపొందిందని, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఏ స్థాయికైనా వెళ్లొచ్చని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు.
ఛండీఘర్ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి పాలైంది. దీంతో ఆప్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. మేయర్ ఎన్నికల్లో బీజేపీ మోసం చేసి విజయం సాధించిందని కేజ్రీవాల్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
Chandigarh mayoral polls: చండీగఢ్ మేయర్ ఎన్నిక ప్రస్తుతం ఇండియా కూటమికి అగ్ని పరీక్ష కాబోతోంది. చండీగఢ్‌లో మేయర్, సీనియర్ డిప్యూటీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు గురువారం (జనవరి 18) ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ఇండియా కూటమి, బీజేపీ పార్టీకి మధ్య ముఖాముఖి పోరుగా ఉండబోతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇండియా కూటమిలో సభ్యుడిగా ఉన్న ఆప్, బీజేపీని ఓడించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఒక విధంగా…