Gujarat police denied stone pelting on Asaduddin Owaisi: ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రయాణిస్తున్న వందేభారత్ ట్రైన్ పై దాడి జరిగిందని ఆరోపించారు ఆపార్టీ నేత వారిస్ పఠాన్. అయితే ఈ వాదనలను పోలీసులు ఖండించారు. అలాంటిదేం జరగలేదని గుజరాత్ పోలీసులు కొట్టిపారేశారు. తాను పార్టీ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రయాణిస్తున్న అహ్మదాబాద్ నుంచి వందేభారత్ రైలులో ప్రయాణిస్తున్న సమయంలో కొంతమంది రాళ్ల దాడికి పాల్పడినట్లు వారిస్ పఠాన్ ఆరోపించారు. ఓ బహిరంగ సభలో పాల్గొనేకు వెళ్లే సమయంలో ఈ దాడి జరిగిందని ఆరోపించారు.
Read Also: Lunar Eclipse: చంద్రగ్రహణం అంటే ఏమిటి? గ్రహణం సమయంలో ఆహార పదార్ధాలపై దర్భను ఎందుకు పెట్టాలి?
అయితే వారిస్ పఠాన్ ఆరోపణలపై తాము దర్యాప్తు చేస్తున్నట్లు గుజరాత్ పోలీసులు వెల్లడించారు. రాళ్లదాడి జరగలేదు.. దానికి సంబంధించి ఎలాంటి కుట్ర జరగలేదని వెల్లడించారు. ఈ సంఘటన భరూచ్, అంకలేశ్వర్ మధ్య జరిగింది. ఈ ప్రాంతంలో నివాసాలు లేవని.. రైల్వే ట్రాక్ మరమ్మత్తులు జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. వందేభారత్ రైలుకు వ్యతిరేఖ దిశలో మరో ట్రాక్ పై పశ్చిమ్ ఎక్స్ ప్రెస్ వస్తున్నట్లు గుర్తించామని.. ఆ సమయంలో వేగంగా వెళ్తున్న రైళ్ల కారణంగా కొన్ని రాళ్లు కోచ్ ఈ02 కోచ్ ను ఢీకొట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. రాళ్ల దాడి జరగలేదని మా పరిశోధనలో తేలింది.
ఈ దాడి ఆరోపణలు చేసిన తర్వాత విచారణ ప్రారంభించారు. ఆర్ఫీఎఫ్, జీఆర్పీ, క్రైమ్ బ్రాంచు, రాష్ట్ర పోలీసులు రంగంలోకి దిగారు. సమగ్ర విచారణ జరిగిన తర్వాత రాళ్ల దాడి జరగలేదని నిర్ధారణకు వచ్చారు. ఈ వ్యవహారంలో రాళ్లదాడి జరగలేదని ఎలాంటి కుట్ర జరగలేదదని అధికారులు తెలిపారు. తరుపది విచారణ సాగుతున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.