భారతదేశంలో రైళ్ల మీద దాడులు చెయ్యడం సర్వసాధారణం అయ్యింది. ముఖ్యంగా వందేభారత్ రైళ్లు ప్రారంభం అయిన తరువాత రైళ్ల మీద అల్లరిమూకలు రాళ్లు రువ్వడం చాలా ఎక్కువ అయ్యింది. వందేభారత్ రైళ్లను టార్గెట్ చేస్తున్నారని ఆరోపణలు వచ్చిన తరువాత మామూలు రైళ్ల మీద దాడులు ఎక్కువ అయ్యాయి. రైళ్లపై రాళ్లు రువ్వడం, ట్రాక్‌లను ధ్వంసం చేయడం వంటి కేసులు పెరుగుతున్నాయి. ఈ దాడులకు సంబంధించి 2023 నుంచి ఫిబ్రవరి 2025 వరకు మొత్తం 7,971 కేసులు నమోదైనట్లు…
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మాదన్నపేట రోడ్డులో గల త్రిబుల్ వన్ అసైన్డ్ భూమిలో పనులు జరుపుతున్నారంటూ ఓ వర్గం వారిని మరో వర్గం వారు అడ్డుకున్నారు. దీంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
Vande Bharat Express: వందే భారత్ రైలు భారతదేశంలో అత్యాధునిక సౌకర్యాలతో రూపొందించిన ప్రీమియం రైలు. ఇది వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం అందించడంలో నూతన ప్రమాణాలను సృష్టించింది. ఇటీవల సెప్టెంబర్ 16, 2024 న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మహారాష్ట్రలో కొత్త మార్గాల్లో ప్రారంభించబడింది. అయితే ఈ రైళ్లు మొదలైనప్పటి నుండి అప్పుడప్పుడు వీటిపై రాళ్లు విసిరిన అనేక ఘటనలను చూసాము. ఈ నేపథ్యంలో తాజాగా మహారాష్ట్రలోని షోలాపూర్ వద్ద వందే భారత్ ఎక్స్‌ప్రెస్…
హర్యానాలోని నుహ్ జిల్లాలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నుహ్‌లోని లహర్‌వాడి గ్రామంలో శుక్రవారం పరస్పర విబేధాల కారణంగా రెండు పార్టీల మధ్య భారీ రాళ్ల దాడి జరిగింది. ఈ క్రమంలో 32 ఏళ్ల యువతి సజీవ దహనమైంది. యువతి మంటల్లో కాలిపోయింది.
యూపీ రాష్ట్రం సంభాల్‌లోని షాహీ జామా మసీదును హరిహర్ దేవాలయంగా పేర్కొనడంతో ఈరోజు మళ్లీ సర్వే నిర్వహిస్తున్నారు. ఏఎస్ఐ సర్వే బృందం తెల్లవారుజామున జామా మసీదుకు చేరుకుంది. మసీదు రీ సర్వే విషయం తెలిసిన వెంటనే ముస్లిం వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున మసీదు వెనుక గుమిగూడారు. జనం తోపులాట సృష్టించి రాళ్లు రువ్వడం ప్రారంభించారు. రాళ్లదాడిలో ఎస్పీ పీఆర్వో గాయపడ్డారు. ఘటనా స్థలంలో భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు.
Warangal: నేడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎమ్మార్వోలు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకానున్నారు. విధి నిర్వహణలో ఉన్న వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ఐఎఎస్ పై దాడికి నిరసనగా నల్ల బ్యాడ్జీలతో విధులు నిర్వహిస్తామన్నారు.
యూపీలోని వారణాసిలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి ఘటన వెనుక వెలుగు చూసిన విషయం తెలిసిందే. విచారణలో వెల్లడైన విషయాలు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి.
Vandebharat : ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్‌లోని బాగ్‌బహ్రా రైల్వే స్టేషన్ సమీపంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై ట్రయల్ రన్ సందర్భంగా రాళ్లదాడి కేసు వెలుగులోకి వచ్చింది. రాళ్లు రువ్వడంతో రైలు మూడు కోచ్‌ల అద్దాలు పగిలిపోయాయి.
ఖమ్మంలోని బీకే నగర్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. హరీష్ రావు పర్యటన సందర్భంగా బీకే నగర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో బీఆర్‌ఎస్ నేతల కార్లు ధ్వంసమయ్యాయి.
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో తమ పేర్లను స్థానిక ఆలయ పండుగ కరపత్రంలో ప్రచురించకపోవడంపై రెండు గ్రూపుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో 80 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందింది. మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నగరంలోని వస్త్రాపూర్ ప్రాంతంలో బుధవారం రాత్రి ఒక వర్గం మరో వర్గంపై కర్రలు, రాళ్లతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.