మన దేశానికి చెందిన దిగ్గజ వ్యాపార సంస్థ టాటా గ్రూప్‌లోని టాటా స్టీల్ పలు దేశాల్లో తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. యూకేలోని వేల్స్ లో ఉన్న తమ స్టీల్ ఉత్పత్తి ప్లాంట్‌లో పని చేస్తున్న సుమారు 2500 మంది ఉద్యోగులను తొలగించేందుకు సంస్థ పూనుకుంది.
Tata Steel Layoffs : ప్రతికూల ఆర్థిక పరిస్థితుల మధ్య కంపెనీల్లో ఉద్యోగులకు తొలగింపుల దెబ్బ పెరుగుతోంది. కొత్త సంవత్సరంలో కూడా తొలగింపులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
Odisha: టాటా స్టీల్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఒడిశాలోని దెంకనల్ జిల్లాలోని టాటా స్టీల్ కు చెందిన మెరమండలి ప్లాంట్ లో మంగళవారం ఆవిరి లీక్ అయింది. ఈ ఘటనలో మొత్తం 19 మంది గాయపడినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. తీవ్రంగా కాలిన గాయాలు అయిన వారిని వెంటనే కటక్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బ్లాస్ ఫర్నెస్ ని పరిశీలిస్తున్న సందర్భంలో ఈ ఘటన జరిగింది. కార్మికులు, పలువురు ఇంజనీర్లు గాయపడ్డారు.
Special Story on JJ Irani: మన దేశం మర్చిపోలేని పారిశ్రామికవేత్తల్లో జమ్‌షెడ్ జె ఇరానీ ఒకరు. జేజే ఇరానీగా, స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందారు. టాటా స్టీల్ కంపెనీ గొప్పతనంతోపాటు భారతదేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటారు. 8 గంటల పని సంస్కృతికి శ్రీకారం చుట్టారు. ఈ నిర్ణయం ఇతర కంపెనీలకు బెంచ్‌మార్క్‌లాగా నిలవటం విశేషం. కేవలం ఇండస్ట్రియలిస్ట్‌గానే కాకుండా స్పోర్ట్స్‌మ్యాన్‌గా, స్టాంపులు-నాణేల సేకరణకర్తగా తన అభిరుచులను చాటుకున్నారు. తుది శ్వాస విడిచే వరకు క్రికెట్‌ను…
Jamshed J Irani, known as Steel man of India, passes away: స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన టాటా స్టీల్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, పద్మభూషన్ డాక్టర్ జంషెడ్ జే ఇరానీ కన్నుమూశారు. సోమవారం రాత్రి జంషెడ్ పూర్ లోని మరణించినట్లు టాటా స్టీల్ తెలిపింది. 86 ఏళ్ల జంషెడ్ జే ఇరానీ మరణంపై టాటా స్టీల్ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది. అనారోగ్యంతో చికిత్స పొందుత.. జంషెడ్ పూర్ లోని టాటా…
Seven Metal Companies into TATA Steel: టాటా గ్రూప్‌కి చెందిన ఏడు మెటల్ కంపెనీలు టాటా స్టీల్‌లో విలీనమయ్యాయి. ఈ విలీనానికి టాటా స్టీల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌కి సమర్పించిన వివరాల ప్రకారం.. టాటా స్టీల్‌లో విలీనమైన ఆ మెటల్ కంపెనీల పేర్లు.. టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, ది టిన్‌ప్లేట్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, టాటా మెటాలిక్స్ లిమిటెడ్, TRF లిమిటెడ్, ది ఇండియన్…
విశాఖపట్నం లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన “రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్” ( వైజాగ్ స్టీల్) ను కొనుగోలు చేసేందుకు టాటా స్టీల్ ఆసక్తి చూపుతుంది. ఈ విషయాన్ని టాటా స్టీల్ సి.ఇ.ఓ, మేనేజింగ్ డైరెక్టర్ టి.వి. నరేంద్రన్ నిర్ధారించారు. విశాఖపట్నంలో ఉక్కు మంత్రిత్వ శాఖ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యం గల ఉక్కు కర్మాగారం ఇది. భారతదేశంలో సముద్ర తీరాన ఉన్న అతి పెద్దదైన సమగ్ర ఉక్కు కర్మాగారం దీని…
టాటాస్టీల్ కంపెనీ మరోసారి ఉదారతను చాటుకుంది. తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో కోవిడ్‌తో కన్నుమూసిన కుటుంబాలకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. ఉద్యోగకాలం ముగిసేవరకు మృతుల జీతాలను మృతిచెందినవారి కుటుంబాలకు అందిస్తామని టాటా స్టీల్ కంపెనీ స్ఫష్టంచేసింది. కేవలం జీతమే కాకుండా ఉద్యోగులకు లభించే అన్ని రకాల ప్రయోజనాలను కూడా వారి కుటుంబాలకు కూడా అందిస్తామని టాటా స్టీల్ కంపెనీ స్ఫష్టం చేసింది. ఉద్యోగుల పిల్లలు చదువుకు సంబంధించి విధ్యాభ్యాస ఖర్చులు కూడా తామే భరిస్తామని టాటా…