Covid-19 Vaccination: ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు విపరీతంగా పెరిగాయి. విషాదం ఏంటంటే యువత, ముఖ్యంగా 30 ఏళ్ల లోపు ఉన్నవారు కూడా గుండెపోటు వల్ల మరణించడం ఆందోళనల్ని పెంచుతోంది. అయితే కోవిడ్-19 తర్వాత ఇలాంటి మరణాలు ఎక్కువగా రికార్డ్ కావడంతో, కోవిడ్ వ్యాక్సినేషన్ వల్లే ఈ మరణాలు సంభవిస్తున్నాయనే అపోహ ఉంది.
అయితే ‘‘ వివరించలేదని ఆకస్మిక మరణాల’’ వెనక కోవిడ్-19 వ్యాక్సినేషన్ ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) మంగళవారం వెల్లడించింది. ఐసీఎంఆర్ అక్టోబర్ 2021-మార్చి 2023 మధ్య 18 నుంచి 45 ఏళ్ల వయసున్న ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో ఆకస్మిక మరణాల గురించి ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ పరిశోధనల్లో ఆకస్మిక మరణాల్లో కోవిడ్-19 టీకా కారణమనే విధంగా ఎలాంటి ఆధారాలు లభించలేదని ఐసీఆర్ ప్రచురించిన ఒక అధ్యయనంలో పరిశోధనా బృందం తెలిపింది.
Read Also: Skill Development Case: చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు ఏపీ సీఐడీ..
అయితే, ఆకస్మిక మరణాలకు ఫ్యామిలీ హిస్టరీ, అతిగా తాగడం, తీవ్రమైన శారీరక శ్రమ వంటి జీవనశైలి ప్రవర్తనలు ఆకస్మిక మరణాలకు కారణమని తెలిపింది. ఐసీఎంఆర్ పరిశోధకులు 29,171 ఆకస్మిక మరణాలను గుర్తించారు. 729 కేసులు, 2916 కంట్రోల్ కేసులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించింది. ఈ అధ్యయనంలో రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఆకస్మిక మరణాలు ముప్పు తగ్గిందని తెలిపింది. కనీసం ఒక్క డోసు తీసుకున్నా కూడా ముప్పు తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ఆకస్మిక మరణాలకు ధూమపానం, మద్యపానంతో పాటు తీవ్రశ్రమ, మరణించడానికి 48 గంటల ముందు మద్యంసేవించడం, మత్తు పదార్థాల వినియోగం వంటి వాటితో పాటు కోవిడ్ చికిత్స తర్వాత జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు వంటివి కూడా కారణాలు కావచ్చని తెలిపింది.