లైక్స్,వ్యూస్ కోసం యూట్యూబ్, సోషల్ మీడియా ఇప్పుడు ఎంతకైనా దిగజారిపోతుంది. వీడియో వ్యూస్ కోసం తప్పుదోవ పట్టించేలా, నీచమైన థంబ్ నెయిల్స్ పెడుతున్నారు. అలాగే క్లిక్ బైట్స్ లాంటి థంబ్ నెయిల్స్ చూసి ప్రేక్షకులు కూడా మోసపోతున్నారు. తాజాగా యాంకర్, తెలుగు నటి గాయత్రి భార్గవి ఈ ఫేక్ థంబ్ నెయిల్స్‌పై ఫైర్ అయింది. ఆమె రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూకి సదరు యూట్యూబ్ ఛానల్ పెట్టిన నీచమైన థంబ్ నెయిల్స్ గురించి చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది.
Also Read: Salman Khan : రష్మికకు లేని బాధ మీకెందుకు..
నటి భార్గవి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి నటిగా వందకు పైగా సినిమాల్లో నటించింది. అయితే రీసెంట్‌గా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ కారణంగా, ఆమె పై ఫేక్ థంబ్ నెయిల్స్ పెట్టి దారుణంగా వైరల్ చేశారు. ముఖ్యంగా తన భర్త బ్రతికుండగానే చనిపోయినట్టు తెలిపారు. తాజాగా ఈ ఫేక్ థంబ్ నెయిల్స్ పై మండిపడుతూ సోషల్ మీడియాలో స్పందించింది భార్గవి..
‘యూట్యూబ్‌లో రాంగ్ థంబ్‌నెయిల్స్ ద్వారా తప్పుడు సమాచారాన్ని ఎలా చూపిస్తారు అనేది చెప్పడానికి మీ ముందుకు వచ్చా.. నేను ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చాను. చాలా బాగా జరిగింది. కానీ అది టెలికాస్ట్ అయిన తర్వాత చూసి షాకయ్యా. మా ఆయన ఆర్మీ ఆఫీసర్.. ఆయనకు ఉన్న వేదన.. ఓ సైనికుడి విషయంలో మాకు జరిగిన ఓ సెన్సిటివ్ ఇష్యూ చెప్పి ఆ ఇంటర్వ్యూలో నేను చాలా బాధపడ్డాను. కానీ దాని వాళ్ళు ఏం చేశారు అంటే.. నేను కంటతడి పెట్టుకున్న ఫోటోలు పెట్టేసి.. ‘‘తన భర్త మంచులో కూరుకుపోయి అక్కడే చనిపోయారు, బాడీ మొత్తం ముక్కలు ముక్కలు చేసి చిన్న డబ్బాలో ఇంటికి పంపించారు.. రాత్రిళ్లు నిద్ర కూడా పట్టెది కాదు’’ అంటూ నా ఫ్యామిలీ ఫోటోలు పెట్టి ఇలా థంబ్ నెయిల్స్ పెట్టారు. ఒక ఆర్మీ ఆఫీసర్ గురించి, ఆయన భార్య గురించి అందరినీ తప్పుదోవ పట్టించేలా ఇక్కడ రాశారు. దీని పైన నువ్వు ఏమనుకుంటున్నావ్ విక్రమ్.. ఈయన మా ఆయన ఇదిగో నా పక్కనే ఉన్నారు..’ అంటూ వీడియో పోస్ట్ చేసింది. అలాగే పక్కనే ఉన్న తన భర్తని చూపిస్తూ..
‘సారీ విక్రమ్.. ఇదేనా మనం ఆర్మీకి ఇచ్చే గౌరవం.. ఆర్మీ అనే కాదు చాలా మంది ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, వాళ్ల గురించి కూడా ఇలానే రాంగ్ థంబ్ నెయిల్స్, మిస్ లీడింగ్ థంబ్ నెయిల్స్ పెడుతున్నారు. ఎందుకు మీరు ఇలాంటి థంబ్ నెయిల్స్ పెడుతున్నారు. వీళ్లే కాదు చాలా మీడియా హౌస్‌లు ఇలానే చేస్తున్నాయి’ అని తెలిపింది. ప్రజంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.దీంతో పలువురు నెటిజన్లు గాయత్రికి సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
I request audience and other affected by this to poll and vote for the cause. ‘Say NO TO DEFORMATORY IN NATURE THUMB NAILS” . @iDreamMedia pic.twitter.com/jKTOXFsZNc
— Gayatri Bhargavi (@GayatriBhargav1) March 23, 2025