Supreme Court: కసబ్ కేసు విచారణ కూడా న్యాయంగానే జరిగింది.. యాసిన్ మాలిక్ కేసులో వ్యాఖ్య
- కసబ్ కేసు విచారణ కూడా న్యాయంగానే జరిగింది
- వేర్పాటువాది యాసిన్ మాలిక్ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేర్పాటువాది యాసిన్‌మాలిక్ కేసు విచారణ సందర్భంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. 26/11 ముంబై దాడుల ఉగ్రవాది కసబ్ కేసు విచారణ కూడా న్యాయంగానే జరిగింది అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. యాసిన్ మాలిక్‌ను కోర్టులో వ్యక్తిగతంగా హాజరుపర్చాలన్న ఆదేశాల మేరకు సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా మన దేశంలో ఉగ్రవాది అజ్మల్ కసబ్ కేసు విచారణ కూడా న్యాయబద్ధంగానే జరిగింది కదా? వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్రాస్ ఎగ్జామినేషన్ ఎలా చేయగలమని ధర్మాసనం ప్రశ్నించింది.
ఇది కూడా చదవండి: Kejriwal: లిక్కర్ కేసులో ఎదురుదెబ్బ.. ట్రయిల్ కోర్టు విచారణపై స్టేకు హైకోర్టు నిరాకరణ
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
1990లో శ్రీనగర్‌లో నలుగురు ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది హత్య కేసు, 1989లో రుబయా సయీద్ కిడ్నాప్ కేసులో వేర్పాటువాది యాసిన్ మాలిక్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసుల విచారణకు మాలిక్ వ్యక్తిగతంగా హాజరుకావాలని జమ్మూ కోర్టు గతంలో ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం జమ్మూ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. తాజాగా గురువారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. భద్రతా కారణాల రీత్యా మాలిక్‌ను జమ్మూకు తీసుకెళ్లలేమని.. సాక్ష్యుల భద్రత కూడా మాకు ముఖ్యమేనని పేర్కొన్నారు. గతంలో ఓ సాక్షిని హత్య చేశారని.. లాయర్‌ను పెట్టుకోకుండా మాలిక్ ట్రిక్స్ ఉపయోగిస్తున్నాడని తెలిపారు. మాలిక్ సాధారణ క్రిమినల్ కాదని.. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌తో అతడికి సంబంధాలున్నాయని గుర్తుచేశారు. గతంలో చాలాసార్లు సయీద్‌ను కలిసేందుకు పాకిస్థాన్‌కు కూడా వెళ్లాడని.. ఇలాంటి కేసుల్లో మేం కేవలం పుస్తకాల్లో ఉన్నట్లు చేయలేమని సీబీఐ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Maharashtra Elections: చరిత్ర సృష్టించిన “మహా” ఓటర్లు.. దశాబ్ధం తర్వాత ఎక్కువ ఓటింగ్ శాతం..
సీబీఐ సమాధానానికి ధర్మాసనం బదులిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘కోర్టుకు తీసుకెళ్లకపోతే వీడియో కాన్ఫరెన్స్‌లో క్రాస్ ఎగ్జామినేషన్ ఎలా చేయగలం? జమ్మూలో ఇంటర్నెట్ సదుపాయం అంతంతమాత్రంగానే ఉంటుంది. మన దేశంలో ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు కూడా పారదర్శక విచారణ ఎదుర్కొనేలా అవకాశాలు కల్పించాం’’ అని వ్యాఖ్యానించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది.

తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!