Air India: ఖలిస్తాన్ ఉగ్రవాది బెదిరింపులు.. పంజాబ్, ఢిల్లీ ఎయిర్‌పోర్టుల్లో భద్రత కట్టుదిట్టం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్(ఎస్‌జేఎఫ్) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ ఇటీవల మరోసారి భారత్‌కి వ్యతిరేకంగా బెదిరింపులకు పాల్పడ్డారు. నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దని ఓ వీడియోలో వెల్లడించారు. సిక్కులు నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దు, మీ ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) పంజాబ్, ఢిల్లీ విమానాశ్రయాలలో ఎయిర్ ఇండియా విమానాలకు అదనపు భద్రతా తనిఖీలను ఆదేశించింది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు పంజాబ్‌లోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో 100 శాతం SLPC (సెకండరీ ల్యాడర్ పాయింట్ చెక్), టెర్మినల్ బిల్డంగ్ సందర్శకులకు తాత్కాలికంగా ఎయిర్ పోర్టు ఎంట్రీ పాసులు ఇవ్వాలని ఆదేశించారు. ఢిల్లీ విమానాశ్రయంలో సందర్శకులు ప్రవేశ టికెట్ల అమ్మకాన్ని నిషేధించారు.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్‌పై నెట్టొద్దు.. పాక్‌పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
Read Also: Pawan Kalyan: ప్రతి భారతీయుడి గుండెలో ధైర్యం నింపిన నేత మోడీ
‘‘నవంబర్ 19న ఎయిర్ ఇండియా ద్వారా ప్రయాణించవద్దని సిక్కు ప్రజల్ని కోరుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా దిగ్బంధనం ఉంటుంది. ఎయిర్ ఇండియాలో ప్రయాణిస్తే మీ ప్రాణాలకు ప్రమాదం’’ అని వీడియోలో పేర్కొన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. నవంబర్ 19న ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు మూసేయబడుతుంది, దాని పేరు మార్చబడుతుంది, అదే రోజు క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని హైలెట్ చేస్తూ హెచ్చరించాడు.
అంతకుముందు కూడా పన్నూ ఇలాగే బెదిరింపులకు పాల్పడ్డాడు. ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ ఇజ్రాయిల్-పాలస్తీనా యుద్ధం నుంచి నేర్చుకోవాలని అన్నాడు. పంజాబ్ నుంచి పాలస్తీనా వరకు అక్రమ ఆక్రమణలో ఉన్న వారంతా ప్రతిస్పందిస్తారు. హింస హింసని ప్రేరేపిస్తుంది అని గతంలో ఓ వీడియోల బెదిరించే ప్రయత్నం చేశాడు.
అమృత్‌సర్ లో జన్మించిన గురుపత్వంత్ సింగ్ పన్నూపై 2019లో ఎన్ఐఏ కేసులు నమోదు చేసింది. అతడిని భారత్ ఉగ్రవాదిగా గుర్తించింది. అమెరికా, యూకే, కెనడా కేంద్రంగా ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రచారం చేస్తున్నాడు. ఇతనకి పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయి. ఫిబ్రవరి 2021లో ఎన్ఐఏ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్స్ జారీ చేసింది. గతేడాది నవంబర్ లో అతడిని ప్రకటిత నేరస్తుడిగా గుర్తించింది.
తాజావార్తలు
-
Idupu Kayitham : రచ్చ రచ్చ చేస్తున్న ‘ఇడుపు కాయితం’.. నేషనల్ ఇష్యూ చేశారంటూ నరేశ్ ఫైర్!
-
MEA: కరాచీ దాడిని భారత్‌పై నెట్టొద్దు.. పాక్‌పై ఘాటు వ్యాఖ్యలు..
-
Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
-
Gold and Silver Price: ఇన్వెస్టర్లకు షాక్.. వచ్చే వారం భారీగా మారనున్న గోల్డ్, సిల్వర్ ధరలు! ఎందుకో తెలుసా?
-
Bank Holidays: జూలైలో బ్యాంక్‌లకు ఏకంగా 12 రోజులు హాలిడేస్.. ఏ ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో క్లియర్‌గా తెలుసుకోండి!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!