ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్(ఎస్‌జేఎఫ్) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ ఇటీవల మరోసారి భారత్‌కి వ్యతిరేకంగా బెదిరింపులకు పాల్పడ్డారు. నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దని ఓ వీడియోలో వెల్లడించారు. సిక్కులు నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దు, మీ ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరించారు.