Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- కేతన్ హత్య కేసులో షాకింగ్ నిజాలు..
- 10 గంటల పాటు మొబైల్ ఇంటర్నెట్ ఆఫ్ చేసిన కేతన్..
- పట్టుబడకుండా ఉండేందుకు కీలక ప్లాన్..
- చివరకు ఇదే నిందితుడిని పట్టించింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ketan Agarwal Murder Case: పూణేకు చెందిన కేతన్ అగర్వాల్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కాబోయే భార్య సియా గోయల్, ఆమె లవర్ చేతన్ చౌదరిలు కలిసి ప్లాన్‌తో హత్య చేవారు. జూన్ 18న పూణేకు సమీపంలోని లోహగఢ్ కోటకు తీసుకెళ్లి, అక్కడి నుంచి తోసేసి చంపారు. అయితే, ఈ కేసులో దొరకకుండా చేతన్ 10 గంటల 40 నిమిషాల పాటు మాస్టర్ ప్లాన్ చేశారు. ఇన్ని గంటల పాటు ‘‘డిజిటల్ బ్లాక్అవుట్’’ అమలు చేసిన తన ఆనవాళ్లు లేకుండా చేశారు. ఈ హత్యలో తన ప్రేమేయం లేదని నమ్మించేందుకు మొబైల్ ఫోన్లో ఇంటర్నెట్ను ఆఫ్ చేసి, సెల్ టవర్ ఆధారంగా తన లొకేషన్ ట్రాక్ చేయకుండా ఉండేందుకు పక్కాగా ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది.
పోలీసులు వివరాల ప్రకారం.. జూన్ 18 ఉదయం 7 గంటల ప్రాంతంలో చేతన్ తన మొబైల్ డేటా ఆఫ్ చేశాడు. 8 గంటలకు తన ఫోన్ తన పెయింట్ షాప్‌లోనే వదిలి, కాల్స్ వస్తే సమాధానం ఇవ్వాలని ఉద్యోగులకు సూచించాడు. దీంతో హత్య జరిగిన సమయంలో షాప్‌లోనే ఉన్నానని నమ్మించే ప్రయత్నం చేశాడు. లోహ్‌గఢ్ వెళ్లే సమయంలో తన ఉద్యోగి మొబైల్ ఉపయోగించాడు. మధ్యాహ్నం సమయంలో కోట వద్దకు చేరుకున్న చేతన్, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా, వింటర్ హుడీని ధరించి అసహజంగా కనిపించడం పోలీసులకు పట్టించింది. సీసీటీవీ కెమెరాల్లో కేతన్, సియాలను చేతన్ అనుసరిస్తున్నట్లు తేలింది.
Also Read
మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో విన్చూ కటా సమీపంలోని ఏకాంత ప్రాంతానికి కేతన్, సియా చేరుకున్నారు. ముందే నిర్ణయించిన సిగ్నల్ ఇవ్వగానే సియా కూర్చోబవడంతో, సమీపంలో ఉన్న చేతన్, కేతన్‌ను 400 అడుగుల లోయలోకి తోసేశాడని పోలీసులు గుర్తించారు. హత్య తర్వాత సాయంత్రం 5.40 గంటల వరకు చేతన్ తన మొబైల్ ఇంటర్నెల్ ఆన్ చేయలేదు. దాదాపుగా 10 గంటల పాటు తాను ఘటనా స్థలంలో లేనని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఏదైతే వ్యూహాన్ని అమలు చేశాడో, అదే వ్యూహం చేతన్‌ను పట్టించింది. చేతన్ మొబైల్ ఇంటర్నెట్ ఆఫ్ చేసి ఉండటం, ఫోన్‌కు ఆయన ఉద్యోగులు సమాధానం ఇవ్వడం, హుడీతో కనిపించడం కీలక ఆధారాలుగా మారాయి.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు