PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- ప్రధాని మోదీకి సీషెల్స్ అత్యున్నత పర్యావరణ పురస్కారం.
- 'గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్' అవార్డుతో సత్కారం.
- పర్యావరణ పరిరక్షణ, క్లైమేట్ యాక్షన్‌లో నాయకత్వానికి గుర్తింపు.
- చిన్న ద్వీప దేశాలకు భారత్ అందించిన సహకారాన్ని ప్రశంసించిన సీషెల్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీకి మరో అంతర్జాతీయ గౌరవం దక్కింది. షీషెల్స్ ప్రభుత్వం అత్యున్నత పర్యావరణ పురస్కారమైన ‘‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హోరైజన్’’(Guardian of the Blue Horizon) అవార్డును ప్రధాని మోదీకి ప్రదానం చేసింది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి , వాతావరణ మార్పులు నియంత్రణలో నాయకత్వానికి గానూ ఈ అవార్డు ప్రదానం చేసింది. ఈ అవార్డు ద్వారా పర్యావరణ పరిరక్షణ, బ్లూ ఎకానమీ, సుస్థిర అభివృద్ధి, సముద్ర వనరుల బాధ్యతాయుత వినియోగం, వాతావరణ మార్పులను ఎదుర్కొనే చర్యల్లో మోదీ చూపిన నాయకత్వాన్ని సీషెల్స్ ప్రభుత్వం ప్రశంసించింది. చిన్న ద్వీప దేశాల అభివృద్ధి, వాతావరణ స్థిరత్వం కోసం భారత్ అందిస్తున్న సహకారాన్ని సీషెల్స్ ప్రభుత్వం ప్రస్తావించింది.
ఈ అవార్డుపై ప్రధాని మోడీ స్పందిస్తూ.. ఈ అవార్డును వినమ్రంగా స్వీకరిస్తున్నానని, ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులు ఎదుర్కొంటున్న దేశాల ప్రజలకు, భవిష్యత్ తరాల కోసం పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా భావించే ప్రతీ ఒక్కరికి ఈ గౌరవాన్ని అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read
- Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
- Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
- Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
- PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
మే 2026లో, ఆహార భద్రతను బలోపేతం చేయడం, వ్యవసాయాన్ని మార్చడం,సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించినందుకు గాను, ఆహార మరియు వ్యవసాయ సంస్థ (FAO) ప్రధాని మోడీకి ‘‘అగ్రికోలా’’ పతకాన్ని ప్రదానం చేసింది. అంతకుముందు, 2018లో, సుస్థిర ఆర్థిక వృద్ధి, ప్రపంచ సహకారం మరియు సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహించినందుకు గాను ఆయన ‘‘సియోల్ శాంతి బహుమతి’’ని అందుకున్నారు. అదే సంవత్సరం, వాతావరణ చర్యలు, అంతర్జాతీయ పర్యావరణ సహకారాన్ని ప్రోత్సహించడంలో ఆయన నాయకత్వాన్ని గుర్తించి, ఐక్యరాజ్యసమితి తన అత్యున్నత పర్యావరణ పురస్కారమైన ‘ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు’ను ఆయనకు ప్రదానం చేసింది.
తాజావార్తలు
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
-
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
-
Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
-
Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
-
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?