Bank Holidays: జూలైలో బ్యాంక్‌లకు ఏకంగా 12 రోజులు హాలిడేస్.. ఏ ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో క్లియర్‌గా తెలుసుకోండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bank Holidays: జూలై నెలలో మీకు బ్యాంకుకు వెళ్లాల్సిన పని ఉందా? అయితే ఈ సమాచారం మీకోసమే. జూలై నెలలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, నగరాల్లో మొత్తం 12 రోజులు బ్యాంకులు క్లోజ్ కానున్నాయి. ఇందులో 4 ఆదివారాలు, 2 శనివారాలు, 6 ప్రాంతీయ పండుగలు, ప్రత్యేక సెలవులు ఉన్నాయి. అయితే ఈ 6 అదనపు ప్రాంతీయ సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి వర్తించవు. కేవలం ఆయా రాష్ట్రాలు, నగరాల్లోని బ్యాంకులకు మాత్రమే ఇవి వర్తిస్తాయి. జూలై నెలలో ఏ ఏ రోజుల్లో బ్యాంకులు మూతపడనున్నాయో ఆ పూర్తి హాలిడే లిస్ట్‌ను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
దేశవ్యాప్తంగా శని, ఆదివారాల సెలవులు
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిబంధనల ప్రకారం.. ప్రతి నెలలో రెండు, నాలుగో శనివారాలు, అన్ని ఆదివారాలు దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు సాధారణ సెలవులు ఉంటాయి. ఆ ప్రకారం జూలైలో వీకెండ్ సెలవుల వివరాలు
Also Read
- పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
జూలై 5: ఆదివారం
జూలై 11: రెండో శనివారం
జూలై 12: ఆదివారం
జూలై 19: ఆదివారం
జూలై 25: నాలుగో శనివారం
జూలై 26: ఆదివారం
ప్రాంతీయ పండుగల సెలవులు
వీకెండ్స్ కాకుండా జూలైలో వివిధ రాష్ట్రాల్లో స్థానిక పండుగలు, ధార్మిక ఉత్సవాలు, ప్రాంతీయ వేడుకల కారణంగా మరో 6 రోజులు బ్యాంకులు పనిచేయవు. ఇవి ఆయా రాష్ట్రాల సంస్కృతి, పండుగలను బట్టి మారుతుంటాయి. కాబట్టి ఖాతాదారులు తమ పరిధిలోని స్థానిక సెలవుల వివరాలను ఒకసారి బ్యాంక్ బ్రాంచ్‌లో లేదా ఆర్బీఐ వెబ్సైట్లో సరిచూసుకోవడం మంచిది.
డిజిటల్ బ్యాంకింగ్ సేవలు యథాతథం
బ్యాంకులు మూతపడినప్పటికీ కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉంటాయని ఆర్బీఐ వెల్లడించింది. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ (UPI), ఎన్ఈఎఫ్టీ (NEFT), ఆర్టీజీఎస్ (RTGS), ఏటీఎం (ATM) సేవలు 24 గంటలూ యథాతథంగా పనిచేస్తాయని చెప్పింది. వీటి ద్వారా డబ్బులు బదిలీ చేయడం, బిల్లుల చెల్లింపులు, నగదు ఉపసంహరణ వంటి పనులను సులువుగా చేసుకోవచ్చు. మీరు నేరుగా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి చెక్కులు డిపాజిట్ చేయడం, డిమాండ్ డ్రాఫ్ట్ (DD) తీసుకోవడం, కేవైసీ (KYC) అప్డేట్ చేయడం లేదా లాకర్లకు సంబంధించిన పనులు చేయాల్సి ఉంటే.. ఈ సెలవుల లిస్ట్‌ను దృష్టిలో ఉంచుకుని ముందే ప్లాన్ చేసుకోండి. దీనివల్ల చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా ఉంటారు.
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!