Gold and Silver Price: ఇన్వెస్టర్లకు షాక్.. వచ్చే వారం భారీగా మారనున్న గోల్డ్, సిల్వర్ ధరలు! ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold and Silver Price: మీరు బంగారం లేదా వెండిలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారా? అయితే వచ్చే వారం మార్కెట్ చాలా కీలకంగా మారబోతోందని విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే వారం బులియన్ మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల్లో మార్పులు, ప్రపంచ దేశాల ఆర్థిక గణాంకాలు రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరల దిశను శాసించనున్నాయని చెబుతున్నారు.
యూఎస్ ఫెడ్ నిర్ణయాలు.. కీలక గణాంకాలు
ఆర్థిక విశ్లేషకుల అంచనా ప్రకారం.. వచ్చే వారం అమెరికా, యూరప్ దేశాల మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ రంగాల పీఎంఐ (PMI) డేటా, యూరోజోన్ ద్రవ్యోల్బణ గణాంకాలు, అమెరికా నాన్-ఫార్మ్ పేరోల్, నిరుద్యోగిత రేటు వివరాలు విడుదల కానున్నాయి. ఈ గణాంకాలను బట్టి అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే సంకేతాలు లభిస్తాయి. దీంతో ఇన్వెస్టర్లు అంతా ఈ డేటా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు అమెరికా – ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న సైనిక ఉద్రిక్తతలు, నిలిచిపోయిన చర్చలు బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయి. ఈ రెండు దేశాల మధ్య వివాదం మరింత ముదిరితే, అది అంతర్జాతీయంగా ముడి చమురు ధరలను పెంచుతుంది. చమురు ధరలు పెరిగితే ఆ ప్రభావం నేరుగా గోల్డ్, సిల్వర్ రేట్లపై పడుతుందని స్పష్టం చేశారు.
Also Read
గత వారంలో భారీగా పతనమైన ధరలు
ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ‘కరెక్షన్’ దశలో ఉన్నాయి. గత వారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర దాదాపు 3.5% తగ్గి 4,096.3 డాలర్ల వద్ద ముగియగా.. వెండి ధర ఏకంగా 10.7% క్షీణించి 59.67 డాలర్లకు పడిపోయింది. ఇక దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో ఆగస్టు డెలివరీ గోల్డ్ ధర 2.06% తగ్గి రూ.1.44 లక్షల (ప్రతి 10 గ్రాములకు) వద్ద ముగిసింది. అలాగే సెప్టెంబర్ డెలివరీ సిల్వర్ ధర 6.4% పతనమై రూ.2.23 లక్షల వద్ద స్థిరపడింది.
ధరలు తగ్గడానికి.. పెరగడానికి కారణాలు..
అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ బలోపేతం కావడం బంగారం ధరలు తగ్గడానికి కారణం అయ్యింది. అలాగే క్రూడ్ ఆయిల్ ధరలు 10% తగ్గడంతో ద్రవ్యోల్బణ భయాలు తగ్గి.. సురక్షిత పెట్టుబడిగా ఉన్న బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపలేదు. ఇదే సమయంలో వచ్చే వారం బంగారం ధరలు పెరగడానికి కారణాలు కూడా ఉన్నాయి. అమెరికా పర్సనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ (PCE) ద్రవ్యోల్బణ గణాంకాలు కాస్త ఆశాజనకంగా రావడం వల్ల దిగువ స్థాయిల్లో కొనుగోళ్లు పెరిగాయి. దీనికి తోడు చైనా సెంట్రల్ బ్యాంక్ నిరంతరం బంగారాన్ని కొనుగోలు చేయడం, యూరోపియన్ యూనియన్‌పై 100% టారిఫ్ విధిస్తామన్న అమెరికా అధ్యక్షుడి హెచ్చరికలు బంగారానికి మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. మొత్తంమీద వచ్చే వారం బులియన్ మార్కెట్లో ఒడిదుడుకులు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నాయని, ఇన్వెస్టర్లు గ్లోబల్ పరిణామాలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!