Canada: కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాడులు బరితెగిస్తున్నారు. భారత్ రాయబార కార్యాలయాన్ని ముట్టడించాలని పిలుపునిచ్చారు. అమెరికాకు చెందిన ‘‘సిఖ్ ఫర్ జస్టిస్(SFJ)’’ వాంకోవర్‌లోని భారత కాన్సులేట్‌ను ముట్టడిస్తామని బెదిరింపులకు పాల్పడింది. భారత కాన్సులేట్‌ను గురువారం స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించింది. ఇండో కెనడియన్లు తమ సాధారణ పనుల కోసం కాన్సులేట్‌కు వచ్చే వారు వేరే తేదీని ఎంచుకోవాలని కోరింది.
Canada: ఖలిస్తానీ ఉగ్రవాదులకు, వారి సంస్థలకు కెనడా ప్రభుత్వం ఎప్పటి నుంచో మద్దతుగా నిలుస్తుందో అందరికి తెలిసిన బహిరంగ రహస్యం. జస్టిన్ ట్రూడో ప్రధానిగా ఉన్న సమయంలో, ఖలిస్తానీ ఉగ్రవాదుల కోసం భారతదేశంతో ఉన్న దౌత్య సంబంధాలను కూడా రిస్క్‌లో పెట్టాడు. అయితే, తొలిసారిగా, కెనడా నిజాన్ని ఒప్పుకుంది.
Gurpatwant Singh Pannun: పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇలాంటి సమయంలో, ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌తో భారత్ యుద్ధం చేస్తే సిక్కులు ఈ యుద్ధంలో పాల్గొనవద్దని పిలుపునిచ్చాడు.
Canada: ఖలిస్తానీలకు అడ్డాగా ఉన్న కెనడాలో అరాచకం సృష్టిస్తున్నారు. వాంకోవర్‌లో ఒక గురుద్వారాపై దాడికి పాల్పడి ధ్వంసం చేశారు. గురుద్వారాపై ఖలిస్తానీ అనుకూల గ్రాఫిటీతో రాతలు రాశారు. ఈ సంఘటన వాంకోవర్‌లోని ఖల్సా దివాన్ సొసైటీ లేదా KDS గురుద్వారాలో జరిగింది, దీనిని రాస్ స్ట్రీట్ గురుద్వారాగా పిలుస్తారు. సిక్కు దేవాలయం పార్కింగ్ స్థలం చుట్టూ ఉన్న గోడపై అనేక చోట్ల ‘‘ఖలిస్తాన్’’ అనే పదాన్ని స్ప్రే పెయింట్ చేసినట్లు గురుద్వారా పరిపాలన అధికారులు చెప్పారు. Read…
Sukhbir Singh Badal: పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై హత్యాయత్నం సంచలనంగా మారింది. ఈ రోజు ఉదయం అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం ప్రవేశద్వారం వద్ద సేవ చేస్తున్న బాదల్‌పై అగంతకుడు దాడికి యత్నించాడు. తుపాకీతో కాల్చే ప్రయత్నం చేశాడు.
Canada: కెనడా నుంచి ఇండియాకు వెళ్లే ప్రయాణికులకు భద్రతా స్క్రీనింగ్ పెంచుతూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోమవారం సాయంత్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో, కెనడా రవాణా మంత్రి అనితా ఆనంద్ మాట్లాడుతూ.. తన డిపార్ట్‌మెంట్ భారత్‌కి ప్రయాణించే వారి కోసం చాలా జాగ్రత్తతో తాత్కాలిక అదనపు భద్రతా స్క్రీనింగ్ చర్యల్ని అమలు చేసిందని చెప్పారు.
కెనడాలోని బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయంపై ఖలిస్థాన్ అనుకూల గుంపు దాడికి వ్యతిరేకంగా సిక్కు కార్యకర్తలు ఆదివారం న్యూఢిల్లీలోని కెనడా హైకమిషన్ వెలుపల ప్రదర్శన నిర్వహించారు. శాంతిభద్రతలను కాపాడేందుకు, వివిధ హిందూ సంస్థల నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో చాణక్యపురిలోని డిప్లమాటిక్ ఎన్‌క్లేవ్‌లోని కెనడా హైకమిషన్ ముందు భద్రతను పెంచారు.
Justin Trudeau: ఖలిస్తానీ వేర్పాటువాదులకు మద్దతు ఇస్తూ వస్తున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్యూడో కీలక వ్యాఖ్యలు చేశారు. దీపావళి, బండి చోర్ దివాస్‌ని పురస్కరించుకుని ఒట్టావాలోని పార్లమెంట్ హిల్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో జస్టిన్ ట్రూడ్ ఈ వ్యాఖ్యల్ని చేశాడు. ‘‘కెనడాలోని సిక్కు సమాజానికి ఖలిస్తానీ వేర్పాటువాదులు ప్రాతినిధ్యం వహించడం లేదు’’ అని చెప్పాడు. ఇలా కెనడా ప్రధాని పేర్కొనడం ఇదే తొలిసారి.
ఖలిస్తానీ మద్దతుదారులు.. హిందూ సమాజానికి చెందిన సభ్యుల మధ్య వాగ్వాదం జరిగిన తరువాత పరిస్థితి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు వచ్చిన పోలీసులు హిందూ వర్గానికి చెందిన వారిని లాఠీలతో కొట్టడం కింది వీడియోలో కనిపిస్తుంది.
Sanjay Kumar Verma: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, భారత సంబంధాల్లో తీవ్రమైన దౌత్యవివాదానికి కారణమైంది. అయితే, ఈ హత్యలో భారత సీనియర్ దౌత్యవేత్త సంజయ్ కుమార్ వర్మకు సంబంధం ఉందని సాక్ష్యాత్తు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, అక్కడి ప్రభుత్వం ఆరోపించింది. ఈ ఆరోపణలతో భారత్ తీవ్రంగా స్పందిస్తూ.. మన దౌత్యవేత్తలు ఆరుగురిని రీకాల్ చేసింది. మనదేశంలోని కెనడా దౌత్యవేత్తలను దేశం వదిలి వెళ్లాలని ఆదేశించింది.