INDIA Bloc Rally: ప్రతిపక్ష ఇండియా కూటమి జార్ఖండ్ రాంచీ వేదికగా బల ప్రదర్శన నిర్వహించింది. ‘‘ఉల్గులన్ న్యాయ్ మహార్యాలీ’’ పేరుతో జార్ఖండ్ అధికార పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) ఈ ర్యాలీని నిర్వహించింది. ఈ సమావేశానికి అస్వస్థత కారణంగా రాహుల్ గాంధీ హాజరుకాలేదు. అయితే, జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సొరెన్ భార్యలు సునీతా కేజ్రీవాల్, కల్పనా సోరెన్ సభకు హాజరయ్యారు. జేఎంఎం కార్యకర్తలు హేమంత్ సోరెన్ మాస్కులతో సభకు హాజరయ్యారు.
Read Also: Sunita Kejriwal: కేజ్రీవాల్ భార్య సంచలన ఆరోపణలు.. భోజనంపై నిఘా, చంపేందుకు కుట్ర..
హేమంత్ సోరెన్‌ని భూ కుంభకోణంలో మనీలాండరింగ్‌కి పాల్పడ్డాడనే ఆరోపణలతో ఈడీ ఆయనను అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ పాలసీలో కేజ్రీవాల్‌ని మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసింది. తాజాగా రాంచీలో జరిగిన ఇండియా కూటమి ర్యాలీలో వేదికపై జైలులో ఉన్న వారి కోసం ఖాళీ కుర్చీలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. ‘‘జైలు తాళం బద్ధలు కొట్టండి, హేమంత్ సోరెన్ ను విడుదల చేస్తారు. జార్ఖండ్ తలవందు’’ అంటి నినాదాలు చేశారు.
ఈ సమావేశానికి కల్పన, సునీతలతో పాటు జేఎంఎం అధినేత శిబు సోరెన్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఆర్జేడీ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తదితరులు హాజరయ్యారు. ప్రభాత్ తారా గ్రౌండ్‌లో జరిగిన ఈ ర్యాలీకి కూటమిలోని మొత్తం 28 రాజకీయా పార్టీలు పాల్గొన్నాయి. ‘ఉలుగులన్’ అంటే విప్లవం అని అర్థం, గిరిజనుల హక్కుల కోసం బ్రిటీష్ వారిపై బిర్సా ముండా చేసిన పోరాటంలో ఈ పదం ఉద్భవించింది.
INDIA परिवार ने अपने वरिष्ठ नेताओं के प्रति दिखाया सम्मान‼️
Delhi CM @ArvindKejriwal जी व Jharkhand के पूर्व CM @HemantSorenJMM जी के लिए मंच पर आरक्षित रखी कुर्सियां।#UlgulanNyayMahaRally pic.twitter.com/DCYGyDZaJ6
— AAP (@AamAadmiParty) April 21, 2024