Sharad Pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో అజిత్ పవార్ తిరుగుబాటుపై ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. ఇది కొత్త కాదని, 1980లో పార్టీ పెట్టిన సమయంలో 58 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే చివరకు 6 మంది మిగిలారని..
Maharashtra: గత మహారాష్ట్ర ఎన్నికల్లో శివసేన-బీజేపీ కూటమి కలిసి పోటీ చేశాయి. అయితే ఆ సమయంలో సీఎం పీఠాన్ని కొరడంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. చివరకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి ‘మహావికాస్ అఘాడీ’ పేరుతో కూటమి కట్టాయి.
Ajit Pawar:మహరాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) కీలక నేత అజిత్ పవార్ అసమ్మతి రగిలించారు. తాజాగా ఆయన బీజేపీ-శివసేన ప్రభుత్వంలో చేరారు. అజిత్ పవార్ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు బిగ్ షాక్ ఇచ్చారు. గత కొంత కాలంగా ఆయన బీజేపీలో చేరుతారనే వార్తల నేపథ్యంలో ఈ రాజకీయ పరిణామం ఎదురైంది. తాజాగా అజిత్ పవార్ తో సహా 9 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
Maharastra Politics: శివసేనలో తగదాలతో ఆ పార్టీ గుర్తు అయిన ‘ధనస్సు-బాణం’ కేంద్ర ఎన్నికల సంఘం స్తంభింపచేసింది. మహారాష్ట్రలో శివసేన చీలిక వర్గాలు శివసేన ధనస్సు-బాణం గుర్తు కోసం న్యాయపరమైన పోరాటం చేస్తున్నాయి. ఇప్పటికే అసలైన శివసేన ఎవరికి చెందుతుందో అనే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘమే తేలుస్తుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇదిలా ఉంటే నవంబర్ లో అంధేరీ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నికల వస్తుండటంతో ఈ రెండు గ్రూపుల మధ్య గుర్తుల కోసం పంచాయతీ…