SRM University: గుంటూరు జిల్లాలోని ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. నాలుగు రోజుల క్రితం కాలేజీ హాస్టల్‌లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలో సుమారు 300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయితే, ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. గుంటూరు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో యూనివర్శిటీ రిజిస్ట్రార్ సెలవులు ప్రకటించారు.. ఇవాళ్టి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు రెండు వారాలపాటు…
Food poisoning: పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు బుర్ద్వాన్ లోని ఒక ప్రైవేట్ రెసిడెన్షియల్ మదర్సాలో దాదాపుగా 100 మంది విద్యార్థులు శనివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా వీరంతా ఆస్పత్రి పాలయ్యారు. ఈ సంఘటన అన్స్‌గ్రామ్ లోని పిచ్‌కురి నవాబియా మదర్సాలో జరిగింది. శనివారం ఉదయం దాదాపు 7-8 మంది విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడ్డాడు. ఆ తర్వాత గంట గంటలకు బాధిత విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరిగింది.
హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. ఒకే కుటుంబంలో 8మందికి ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఎల్బీనగర్ చింతలకుంటలో ఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబం బోనాల పండుగ రోజు తెచ్చుకున్న మటన్ ను వండి ఫ్రిజ్లో పెట్టుకుంది. ఫ్రిజ్లో లో నిల్వ చేసిన మటన్ ని ఈ రోజు తిరిగి తినడంతో ఫుడ్ పాయిజన్ కు గురైనట్లు సమాచారం. ఫుడ్ పాయిజన్ కావడంతో ఆర్టీసీ ఉద్యోగి శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా ఏడుగురు…
KTR : రాష్ట్రంలో విద్యార్థుల ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన కల్తీ ఆహార ఘటనలు, విద్యార్థుల మృతుల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిస్థాయి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఒకే ఏడాది కాలంలో వేలాది మంది విద్యార్థులు కల్తీ ఆహారంతో అనారోగ్యం పాలవడం, 100 మందికిపైగా విద్యార్థులు మృతిచెందడం దారుణమని కేటీఆర్ విమర్శించారు. ఇది ప్రభుత్వ పరిపాలనలో ఘోరమైన…
Tamil Nadu: తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలోని ఒక ఆలయంలో అన్నదానం తర్వాత పలువురు భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్ వల్ల 107 మంది భక్తులు ఆస్పత్రి పాలయ్యారు. విరుదునగర్ జిల్లాలోని కల్విమడై గ్రామంలోని కరుప్పన్న స్వామి ఆలయంలో ఈ సంఘటన జరిగింది. జూన్ 6 నుంచి ఆలయంలో కుంభాభిషేకం ఉత్సవంలో భాగంగా సామూహిక అన్నాదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
Harish Rao : వేములవాడలో కోడెల మృతి, ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేయడం చేతకావడం లేదని వ్యాఖ్యానించారు. ఎర్రగడ్డ మానసిక రోగులకు తగిన ఆహారం కూడా అందడం లేదని 70 మంది ఆస్వస్థతకు గురయ్యారని, ఈ విషయంపై ఇప్పటివరకు సీఎం నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదని మండిపడ్డారు. వేములవాడలో కోడెల మరణం కొనసాగుతుండగా ప్రభుత్వం స్తంభించినట్లే…
Damodara Raja Narasimha : తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఫుడ్ పాయిజన్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జూన్ 2న జరిగిన ఈ ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ స్పందించారు. మొత్తం 92 మంది రోగులు అస్వస్థతకు గురవగా, వారిలో 18 మందిని తీవ్రంగా ఉండటంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారిని గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా సహా ఇతర ఆసుపత్రుల్లో ఏర్పాటు…
Food Poison : ఎర్రగడ్డలోని ప్రభుత్వ మానసిక ఆరోగ్య కేంద్రంలో ఫుడ్ పాయిజనింగ్ కలకలం రేపింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 30 మందికి పైగా మానసిక రోగులు భోజనం చేసిన అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో కరణ్ అనే వ్యక్తి కార్డియాక్ అరెస్ట్‌కు గురై మృతిచెందాడు. ఇతర బాధితులను ఆసుపత్రి సిబ్బంది వెంటనే చికిత్సకు తరలించగా, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై ఆసుపత్రి వైద్యాధికారులు, పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆహారం…
ఫుడ్ పాయిజన్ ఘటనలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు. అధికారుల అలసత్వం ఉందని తేలితే ఇంటికి పంపుతామని మంత్రి వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం ప్రతి ఏటా చేసిన అభివృద్ధిని ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా ప్రజల ముందు ఉంచుతామని ఆయన పేర్కొన్నారు.
కొమురం భీం జిల్లా పోలీసులతో పాటు ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లా పోలీసులను సైతం ఉన్నతాధికారులు రప్పించారు. విద్యార్ధిని ఇంటికి వెళ్లేందుకు ఎమ్మెల్యే కోవా లక్ష్మీ ఒక్క వాహనానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. అలాగే, జిల్లాలో మీడియాపై సైతం పోలీసుల ఆంక్షలు విధించారు. విద్యార్ధిని శైలజ స్వగ్రామానికి వెళ్లకుండా 10 కిలో మీటర్ల దూరంలో మీడియాను ఆపేశారు పోలీసులు.