నిన్న చెన్నైలో విమానంలో జరిగిన పెళ్లి పై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు అనుమతినిచిన ఎయిర్ లైన్స్ సంస్థ స్పైస్ జెట్ పై కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించి ఇలాంటి కరోనా టైంలో పెళ్లికి విమానం అద్దెకు ఇచ్చిన స్పైస్ జెట్ పై సీరియస్ యాక్షన్ తీసుకోవాలనే డీజీసీఏ నిర్ణయం తీసుకుంది. ఫ్లయిట్ లో కనీసం భౌతిక దూరం పాటించకపోవడం, మాస్క్ లు ధరించకపోవడం పై అసహాయం వ్యక్తం చేసింది. కరోనా లాక్ డౌన్ తో విమానం లోనే పెళ్లి చేసుకున్నారు నూతన దంపతులు మధురైకి చెందిన రాకేష్, దక్షిణ. ఈ క్రమంలో బెంగళూరు నుండి మధురై కి వచ్చే విమానం లోనే పెళ్ళికి ఏర్పాట్లు చేసిన రాకేష్ కుటుంబ సభ్యుల సమక్షం లోనే పెళ్లి చేసుకున్నారు. పెళ్లికోసం రెండు గంటలపాటు విమానం అద్దెకి తీసుకున్నారు కుటుంబ సభ్యులు. స్పైస్ జెట్ విమానం ద్వారా బెంగళూరు నుండి మధురై వరకు పెళ్లి తరువాత మధురై నుండి బెంగళూరుకి ప్రయాణం చేసారు. ప్రస్తుతం ఈ పెళ్ళికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.