Maharashtra Cabinet: మహారాష్ట్రలో మంత్రి వర్గ విస్తరణపై ఉత్కంఠ కొనసాగుతుంది. హోంశాఖ కావాలని పట్టుబట్టిన శివసేన (షిండే) వర్గానికి ఆ పదవి దక్కడం లేదని ప్రచారంతో ఆయన ఆర్థిక రాజధాని ముంబైని వదిలి పెట్టినట్లు తెలుస్తుంది.
మహారాష్ట్ర మంత్రి మండలిలో గరిష్ఠంగా 43 మంది మంత్రులను నియమించుకునే ఛాన్స్ ఉంది. ఇందులో 20కి పైగా పదవులను భారతీయ జనతా పార్టీ తీసుకునేందుకు మహాయుతి కూటమి నేతల మధ్య అంగీకారం కుదిరినట్లు ఓ ఇంగ్లీష్ మీడియా కథనాలు ప్రచురించింది. శివసేన(షిండే)కు 13, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీకి 9 క్యాబినెట్ సీట్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు టాక్.
సార్వత్రిక ఎన్నికల వేళ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ఓ వైపు తాయిలాలు ప్రకటిస్తూనే.. మరో వైపు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
Anil Ambani: ముంబై మెట్రో వన్‌లో అనిల్ అంబానీ కంపెనీ వాటాకు సంబంధించిన ఒప్పందాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ వారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
సార్వత్రిక ఎన్నికల వేళ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇటీవలే మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి మారాఠా రిజర్వేషన్ బిల్లును ఆమోదించింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడిన 40 రోజుల తర్వాత మంత్రివర్గ విస్తరణ, మంత్రుల ప్రమాణ స్వీకారం ప్రక్రియ మంగళవారం పూర్తయిన విషయం తెలిసిందే. తమకు కీలక శాఖల బాద్యతలు అప్పగిస్తారా లేక అంతగా ప్రాధాన్యత లేని శాఖలు లభిస్తాయా అనే దానిపై మంత్రుల్లో నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడింది. మంత్రులకు శాఖలను కేటాయిస్తూ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో కొత్తగా నియమితులైన మంత్రులకు త్వరలో శాఖలు కేటాయిస్తామని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శనివారం తెలిపారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్ర రైతులు నష్టపోయిన పంట నష్టపరిహారాన్ని ప్రభుత్వం త్వరలో విడుదల చేస్తుందని హామీ ఇచ్చారు.