కేంద్రానికి ఆమ్ ఆద్మీ పార్టీ లేఖ రాసింది. కేజ్రీవాల్‌కు వసతి కల్పించాలని కోరింది. దీని కోసం సుదీర్ఘ న్యాయ పోరాటం చేయాల్సిన అవసరం ఉండబోదని ఆశిస్తున్నట్లు ఆప్ పేర్కొంది.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల రంగంలోకి దిగుతున్నారు. శుక్రవారం నుంచి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది.