BJP MP Laxman: ప్రధాని మోడీ వంద రోజుల పాలన ట్రైలర్ మాత్రమే అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. వరసగా మూడు సార్లు బీసీ నేత ప్రధాని ఐన ఘనత మోడీకి దక్కిందన్నారు. దీనిని రాహుల్ గాంధీ, ఆయన కుటుంబం జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. గత వందరోజుల్లోనే చారిత్రక, వికసిత భారత్ దిశగా నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. ఆరు గ్యారంటీల పేరుతో మూడు రాష్ట్రాల్లో గెలిచిన కాంగ్రెస్ వంచిస్తోందన్నారు. వికసిత భారత్ సంకల్ప రోడ్ మ్యాప్ దిశగా మోడీ పాలన అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేల రైతులకు పెద్ద పీట అని తెలిపారు. నేషనల్ హైవేలు, రైల్వే లైన్లు, ఓడ రేవులు నిర్మాణం వంద రోజుల్లో చేపట్టామన్నారు. 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్స్ కు అయుశ్మాన్ భారత్ వర్తింపు అని తెలిపారు. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలో 75 వేల సీట్లు పెంపు అన్నారు. పేపర్ లీకేజీ నివారణకు కొత్త చట్టం తీసుకొచ్చామని తెలిపారు. మోడీ ఈ వంద రోజుల పాలన ట్రైలర్ మాత్రమే అన్నారు. వంద రోజుల పాలనపై మేము చర్చకు సిద్ధం అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లతో డిబేట్ కు సిద్ధమని తెలిపారు.
Gandhi Bhavan: గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత.. కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట..