MadhyaPradesh: మధ్యప్రదేశ్‌లో చనిపోయిన భార్య మృతదేహాన్ని భర్త ఫ్రీజర్‌లో దాచిపెట్టాడు. రెండు రోజులుగా ఫ్రీజర్‌లో ఉంచిన మృతదేహంపై చనిపోయి మహిళ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం తరలించారు.మహిళ మరణించిన విషయాన్ని కనీసం కుటుంబసభ్యులకు కూడా తెలపకపోవడంతో అనుమానాలు తలెత్తుతున్నాయి. మహిళ మరణించడంపై ఆమె సోదరుడు.. ఆమె భర్త మీద హత్యారోపణలు చేస్తున్నాడు. రానీ భర్త మాత్రం.. తన భార్య అనారోగ్యంతో మృతి చెందిందని.. తన కుమారుడు వచ్చేవరకు వేచి ఉంచాలని మృతదేహాన్ని ఫ్రీజర్ లో దాచి ఉంచినట్టు చెబుతున్నాడు.
Read also: Petrol-Diesel: డీజిల్ డిమాండ్ తగ్గింది.. పెట్రోలుకు పెరిగింది.. కారణం తెలిస్తే షాక్ అవుతారు
ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు తెలిపారు. మధ్యప్రదేశ్ లోని రీవా పరిధిలోని జివులా గ్రామానికి చెందిన సుమిత్ర మిశ్ర మృతి చెందిందని ఆమె సోదరుడికి జులై రెండవ తేదీన తెలిసిందని వెంటనే వారు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు. ఆ సమాచారం మేరకు పోలీసులు సుమిత్ర మిశ్రా భర్త అయిన భరత్ మిశ్రా ఇంటికి చేరుకున్నారు. అప్పటికే భరత్ ఇంట్లో ఫ్రీజర్ లో అతని భార్య సుమిత్ర మిశ్రా మృతదేహం లభించింది. ఆ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. సుమిత్ర సోదరుడు అభిరాజ్.. తన సోదరి మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేశాడు. తన సోదరిని ఆమె భర్త భరత్ కొట్టి చంపేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమెను భర్త చాలా కాలంగా వేధిస్తున్నాడని తెలిపాడు. ఇప్పుడు ఏకంగా హత్య చేశాడని.. మృతదేహాన్ని ఫ్రీజర్ లో ఉంచాడని ఆవేదన వ్యక్తం చేశాడు. కానీ మృతురాలి భర్త భరత్ మాత్రం … జూన్ 30వ తేదీన తన భార్య అనారోగ్యంతో మృతి చెందిందని అంటున్నాడు.
Read also: Central Cabinet Meeting : నేడు మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం
తన కుమారుడు ముంబైలో ఉంటున్నాడని.. తల్లి చనిపోయిన వెంటనే ఆ విషయాన్ని అతనికి చెప్పానని.. కొడుకు హర్ష వచ్చేవరకు మృతదేహాన్ని ఉంచడం కోసం ఫ్రీజర్ లో ఉంచానని చెబుతున్నాడు. దీనికోసం లయన్స్ క్లబ్ నుంచి ఫ్రీజర్ తెప్పించి.. మృతదేహాన్ని సురక్షితంగా ఉంచానని చెప్పుకొచ్చాడు. తన భార్య మృతికి పైల్స్ కారణమని.. చాలా కాలంగా ఈ వ్యాధితో బాధపడుతోందని తెలిపాడు. పైల్స్ తగ్గడం కోసం మంత్రగాడిని ఆశ్రయించిందని కూడా చెప్పుకొచ్చాడు. ఆమె మృతికి అనారోగ్యమే కారణమని భర్త చెబుతున్నాడు. దీనిమీద పోలీసు అధికారి విజయ్ సింగ్ మాట్లాడుతూ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించామని.. ఆ రిపోర్టు వచ్చిన తర్వాతే మహిళ మృతికి గల కారణాలు తెలుస్తాయని చెప్పారు. మహిళ మృతిపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.