Uttar Pradesh: వలస కూలీల సైకిళ్ల వేలం.. ప్రభుత్వానికి రూ.21 లక్షల ఆదాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2020 లాక్‌డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా చాలా మంది కూలీలు తమ స్వస్థలాలకు తరలివెళ్లిపోయారు. ఆ సమయంలో సరైన రవాణా సౌకర్యాలు కూడా లేవు. దీంతో వలస కూలీలు కాలి నడకన లేదా సైకిళ్ల మీద సొంతూళ్లకు వెళ్లారు. యూపీలో కొందరు వలస కూలీలు తమ సైకిళ్లను సహరణ్ పూర్‌లో వదిలి వెళ్లారు. ఎందుకంటే సహరణ్ పూర్ జిల్లా కేంద్రం అనేక రాష్ట్రాలకు మెయిన్ సెంటర్‌గా ఉంటుంది. దీంతో ఆ ప్రాంతంలో కూలీలు భారీ ఎత్తున సైకిళ్లు వదిలివెళ్లారు. ఇన్నాళ్లు ఆయా సైకిళ్లు ఎండకు ఎండి.. వానకు తడిచి పాడవుతున్నాయి. దీంతో ప్రభుత్వం స్పందించింది.
Corona: ‘కార్బెవాక్స్’ బూస్టర్ డోస్ కు అనుమతి
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం లాక్‌డౌన్ విధించిన సమయంలో కూలీలు వదిలి వెళ్ళిన సైకిళ్లను యూపీ ప్రభుత్వం తాజాగా వేలం వేసింది. మొత్తం 5,400 సైకిళ్లను వేలం వేయగా రూ.21 లక్షల ఆదాయం వచ్చింది. సహరణ్ పూర్ జిల్లా కేంద్రం అనేక రాష్ట్రాలకు వెళ్లేందుకు మెయిన్ సెంటర్‌గా ఉంది. ఇక్కడి నుంచి హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లొచ్చు. సైకిళ్ల ద్వారా సహరణ్‌పూర్ చేరుకున్న కూలీలను అధికారులు బస్సులు, ఇతర రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసి సొంతూళ్లకు తరలించారు. సైకిళ్లు విడిచి వెళ్లే వాళ్లకు టోకెన్లు కూడా ఇచ్చారు. దాదాపు 14,600 మంది తమ సైకిళ్లను అక్కడే వదిలేసి వెళ్లారు. కొంత కాలం తర్వాత చాలా మంది తిరిగొచ్చి టోకెన్లు చూపించి తమ సైకిళ్లు తీసుకెళ్లారు. రెండేళ్లు గడుస్తున్నా ఇంకొందరు సైకిళ్లను తీసుకెళ్లలేదు. దీంతో సుమారు 5,400 సైకిళ్లు అలాగే ఉండిపోయాయి. తాజాగా ఈ సైకిళ్లను యూపీ ప్రభుత్వం వేలం వేసింది.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!