సామాన్యుడు కొనలేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కులనంటుతున్నాయి. ఈ నేపథ్యంలో బయటకు బండి తీయాలంటేనే వణికిపోతున్న ప్రజలు.. వాహనాలకు బదులు సైకిళ్లను కొనేందుకు ఇష్టపడుతున్నారు.
2020 లాక్‌డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా చాలా మంది కూలీలు తమ స్వస్థలాలకు తరలివెళ్లిపోయారు. ఆ సమయంలో సరైన రవాణా సౌకర్యాలు కూడా లేవు. దీంతో వలస కూలీలు కాలి నడకన లేదా సైకిళ్ల మీద సొంతూళ్లకు వెళ్లారు. యూపీలో కొందరు వలస కూలీలు తమ సైకిళ్లను సహరణ్ పూర్‌లో వదిలి వెళ్లారు. ఎందుకంటే సహరణ్ పూర్ జిల్లా కేంద్రం అనేక రాష్ట్రాలకు మెయిన్ సెంటర్‌గా ఉంటుంది. దీంతో ఆ ప్రాంతంలో కూలీలు భారీ ఎత్తున సైకిళ్లు వదిలివెళ్లారు.…