India Post Recruitment 2026: 10th పాసయ్యారా?.. ఇండియా పోస్ట్‌లో ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం.. మంచి జీతం
- స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీకి ఇండియా పోస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్
- 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు అవసరమైన డ్రైవింగ్ అర్హతలు
- గరిష్ట వయస్సు 56 సంవత్సరాలు మించకూడదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇండియా పోస్ట్ నుంచి కీలక అవకాశం వచ్చింది. స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీకి ఇండియా పోస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు అవసరమైన డ్రైవింగ్ అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామక ప్రక్రియలో భాగంగా మొత్తం 11 స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో బెంగళూరులోని మెయిల్ మోటార్ సర్వీస్ (MMS)లో 10 పోస్టులు, మైసూరులోని MMS సబ్-డిపోలో ఒక పోస్టు ఉన్నాయి.
దరఖాస్తు విధానం ఎలా?
ఈ పోస్టులకు దరఖాస్తులను ఆఫ్‌లైన్ విధానంలో స్వీకరిస్తారు. అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తు ఫారంతో పాటు అవసరమైన పత్రాలను స్వీయ ధృవీకరణ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి.
Also Read
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
- Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
- ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
దరఖాస్తులను ఈ చిరునామాకు పంపాలి:
The Manager,
Mail Motor Service,
Bengaluru – 560001
ఎంప్లాయ్మెంట్ న్యూస్‌లో సంబంధిత ప్రకటన ప్రచురించిన తేదీ నుంచి 60 రోజుల్లోపు దరఖాస్తు ఫారాలను సమర్పించాల్సి ఉంటుంది.
విద్యార్హతలు
స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
అలాగే అభ్యర్థులకు ఈ క్రింది అర్హతలు ఉండాలి:
తేలికపాటి, భారీ మోటార్ వాహనాలకు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
కనీసం 3 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉండాలి.
వాహనాల్లో చిన్నపాటి మరమ్మతులు, నిర్వహణపై ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి.
వయోపరిమితి
ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల గరిష్ట వయస్సు 56 సంవత్సరాలు మించకూడదు.
ఎవరు దరఖాస్తు చేయవచ్చు?
ఇండియా పోస్ట్ స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రమే అర్హులు. ముఖ్యంగా తపాలా శాఖలో పనిచేస్తున్న అర్హత కలిగిన ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇందులో డిస్పాచ్ రైడర్లు, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) వంటి ఉద్యోగులు కూడా ఉన్నారు. తపాలా శాఖలో తగిన అర్హత కలిగిన అభ్యర్థులు అందుబాటులో లేకపోతే ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అర్హత కలిగిన ఉద్యోగులను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. అందువల్ల ప్రైవేట్ ఉద్యోగులు లేదా సాధారణ నిరుద్యోగ అభ్యర్థులు ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునే ముందు అర్హత నిబంధనలను తప్పనిసరిగా పరిశీలించాలి.
ఎంపిక ప్రక్రియ
అభ్యర్థుల ఎంపిక ట్రేడ్ టెస్ట్/డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా జరుగుతుంది.
డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు వాహన నిర్వహణకు సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానాన్ని కూడా పరీక్షించే అవకాశం ఉంటుంది. ఎంపిక ప్రక్రియలో అర్హత సాధించిన అభ్యర్థులను సంబంధిత పోస్టులకు నియమిస్తారు.
జీతం ఎంత?
స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 7వ పే కమిషన్ Pay Level-2 ప్రకారం జీతం లభిస్తుంది.
ప్రారంభ జీతం: రూ.19,900
గరిష్ట పే: రూ.63,200
దీనికి అదనంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తించే అలవెన్సులు కూడా లభిస్తాయి.
దరఖాస్తు చేసే ముందు..
ఇండియా పోస్ట్ స్టాఫ్ కార్ డ్రైవర్ రిక్రూట్మెంట్ 2026కు దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్న విద్యార్హతలు, డ్రైవింగ్ అనుభవం, వయోపరిమితి, సర్వీస్ నిబంధనలు, అవసరమైన ధ్రువపత్రాలు, దరఖాస్తు గడువు వంటి వివరాలను పూర్తిగా పరిశీలించాలి. ముఖ్యంగా ఈ నియామకం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే సంబంధించినది కాబట్టి అర్హతను నిర్ధారించుకున్న తర్వాతే దరఖాస్తు ఫారాన్ని పంపడం మంచిది.
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!