RC17 – Rukmini Vasanth: చరణ్ – సుకుమార్ సినిమాలో కాంతార హీరోయిన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RC17 – Rukmini Vasanth: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న చిత్రం #RC17. ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్ ఒకటి సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా కాంతార సినిమాతో పాన్ ఇండియా లెవల్లో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న కన్నడ నటి రుక్మిణి వసంత్‌ను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. ఇప్పటికే ఆమెను చిత్రబృందం సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అంతేకాదు ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం లేడీ సూపర్ స్టార్ నయనతారను ఎంపిక చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. కథలో ఆ పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరోవైపు సంగీత దర్శకుడి విషయంలో కూడా ఈ సినిమా ప్రత్యేకంగా నిలవనుంది. ఇప్పటి వరకు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన దాదాపు అన్ని చిత్రాలకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అయితే ఈసారి మాత్రం ఆ సెంటిమెంట్‌కు బ్రేక్ పడనున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి ‘ధురంధర్’ ఫేమ్ శాశ్వత్ సచ్దేవ్ సంగీతం అందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతి అప్డేట్ సినీ అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని పెంచుతోంది.
Also Read
తాజావార్తలు
-
Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
-
Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
-
Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
-
Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
-
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే విక్రయం!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!