హింసాత్మాక ఘటనలతో ఇంపాల్, జిరిబామ్ జిల్లాల్లో గత 13 రోజులుగా మూతబడిన పాఠశాలలు, కాలేజీల్లో నేటి (నవంబర్ 29) నుంచి రెగ్యులర్ తరగతులు పునఃప్రారంభించబోతున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేసింది.
Manipur Violence: హింసాత్మక ఘటనలతో మరోసారి మణిపూర్‌లో ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్‌లతో పాటు బిష్ణుపూర్, తౌబాల్, కక్చింగ్, కాంగ్‌పోక్పి, చురచంద్‌పూర్ జిల్లాల్లో రెండు రోజుల పాటు ఇంటర్నెట్ నిలిపేశారు. ఇంఫాల్ లోయలోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఆందోళనకారులు పలువురు ఎమ్మెల్యేల నివాసాలపై దాడులు చేసిన ఆస్తుల్ని ధ్వంసం చేశారు
మణిపూర్‌లో కుకీల హింసాకాండ కొనసాగుతోంది. జిరిబామ్ జిల్లాలో కుకీ ఉగ్రవాదులు సోమవారం (నవంబర్ 11న) భద్రతా బలగాలపై కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ దాడి తర్వాత వారు ఆరుగురిని కిడ్నాప్ చేశారు. బోరోబెక్రా పోలీస్ స్టేషన్, దానికి దగ్గరలోని సిఆర్‌పిఎఫ్ పోస్ట్‌పై కుకీల హింసాత్మక దాడి తర్వాత నుంచీ ఆ ప్రాంతంలో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు కనిపించడం లేదు. వారిని కుకీ ఉగ్రవాదులే ఎత్తుకుపోయారని పోలీసులు భావిస్తున్నారు.