Election Commission: అమిత్ షా, రాహుల్ గాంధీలకు ఈసీ నోటీసులు..
- ఫైనల్ స్టేజ్‌కి చేరిన మహారాష్ట్ర ఎలక్షన్స్..
- అమిత్ షా, రాహుల్ గాంధీలకు ఈసీ నోటీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election Commission: బీజేపీ, కాంగ్రెస్ పార్టీల స్టార్ క్యాంపెయినర్లు అయిన అమిత్ షా, రాహుల్ గాంధీలు చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం శనివారం నోటీసులు జారీ చేసింది. ఇద్దరు చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్‌ని ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించింది. బీజేపీ, కాంగ్రెస్ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు రెండు రోజుల ముందు, సోమవారం లోగా తమ రెస్పాన్స్ తెలియజేయాలని ఆదేశించింది.
Read Also: US-Iran: ట్రంప్‌ని చంపడానికి ప్రయత్నించబోం.. అమెరికాకు ఇరాన్ హామీ..
Also Read
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
- Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
- CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
నవంబర్ 06న ముంబైలో జరిగిన ఒక సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ… ‘‘మహారాష్ట్ర నుంచి అవకాశాలను, పెట్టుబడులను ఇతర రాష్ట్రాలకు దోచిపెట్టారు’’ అని అన్నారు. రాహుల్ గాంధీ తప్పుడు ఆరోపణలు చేశారని ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. ‘‘ రాహుల్ గాంధీ తన ప్రకటనతో మహారాష్ట్ర యువతను రెచ్చగొడుతున్నారు. ఇది జాతి ఐక్యత, సమగ్రతకు ప్రమాదకరం. ఆయన ప్రసంగం అబద్ధాలతో నిండి ఉంది. మహరాష్ట్ర గుజరాత్, ఇతర రాష్ట్రాల ప్రజల మధ్య విభేదాలు, శత్రుత్వం సృష్టించేందుకు ప్రయత్నించారు.’’ అని నవంబర్ 11న ఈసీ ఎదుట బీజేపీ కంప్లైంట్ చేసింది.
నవంబర్ 12న జార్ఖండ్ ధన్‌బాద్‌లో అమిత్ షా మాట్లాడుతూ… కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు విభజన, దురుద్దేశపూరిత ప్రకటనలు చేస్తోందని ఆరోపించారు. ‘‘ అమిత్ షా తన ప్రసంగంలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, దేశంలో తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను తొలగించాలని యోచిస్తోందని ఆరోపించారు. ’’ ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నవంబర్ 13న కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది.
తాజావార్తలు
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు