Amit Shah: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాలను కొనసాగిస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: వచ్చే నెలలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు ఈ అసెంబ్లీ ఎన్నికలు ఇటు బీజేపీకి, అటు కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకంగా మారాయి. దీంతో పార్టీల అగ్రనేతలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇదిలా ఉంటే సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో పర్యటించారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బుజ్జగింపులు మొదలుపెడుతుందని ఆరోపించారు.
రాజ్‌నంద్‌గావ్ లో జరిగిన ఈ ర్యాలీలో అమిత్ షా ప్రసంగించారు. కాంగ్రెస్ అవినీతి ఫుడ్ ఛైన్ రెస్టారెంట్ లాగా ఢిల్లీ వరకు విస్తరించిందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతిపరుల నుంచి ప్రతీ పైసా రికవరీ చస్తామని, తలకిందులుగా వేలాదీస్తామని హెచ్చరించారు. గతంలో మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు వెనుకబడిన రాష్ట్రాలుగా ఉండేవని, రమణ్ సింగ్ అధికారంలో వచ్చిన 15 ఏళ్లలో ఛత్తీస్గఢ్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అవతరించిందని ఆయన అన్నారు.
Also Read
- SIPRI Report: పాకిస్తాన్ అణు అహంకారం బద్దలు.. ఆపరేషన్ సిందూర్‌పై సంచలన రిపోర్ట్..
- 100% Ethanol: 100% ఇథనాల్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. E100 ఇంధనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం
- Bihar Police Exam Chaos: పరీక్ష రోజున రైళ్లు ఆలస్యం.. ఆగ్రహంతో రాళ్ల దాడికి దిగిన కానిస్టేబుల్ అభ్యర్థులు
- NDA Women Cadets: భారత రక్షణ రంగంలో నయా హిస్టరీ.. చరిత్ర సృష్టించిన నారీమణులు! ‘ఎన్డీఏ’ తొలి మహిళా సింహాలు వీరే..
Read Also: Israel-Hamas War: “అలా ఐతేనే”.. ఇజ్రాయిల్ బందీల విడుదలపై ఇరాన్ కీలక ప్రకటన..
ఏప్రిల్ నెలలో బెమెతర జిల్లాలోని బీరాన్ పూర్ గ్రామంలో జరిగిన మతహింసను ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ సీఎం భూపేష్ బఘేల్‌ని విమర్శించారు. మళ్లీ మతపరమైన అల్లర్లకు కేంద్రంగా మారాలని కోరకుంటున్నారా..? అని ప్రజల్ని ప్రశ్నించారు. వేదికపై ఉన్న ఈశ్వర్ సాహును చూపిస్తూ.. బుజ్జగింపు రాజకీయం కోసం భువనేశ్వర్ సాహూను కొట్టి చంపారని, భువనేశ్వర్ సాహూకు న్యాయం చేయాలని అతని తండ్రికి టికెట్ ఇచ్చామని అమిత్ షా అన్నారు.
ఛత్తీస్‌గఢ్ లో కాంగ్రెస్ హయాంలో వివిధ రకాల కుంభకోణాలు జరిగాయని.. రాష్ట్రాన్ని ఢిల్లీ దర్బారుకు ఏటీఎంగా మార్చారని అమిత్ షా ఆరోపించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నవంబర్ 7, 17 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది.
తాజావార్తలు
-
SIPRI Report: పాకిస్తాన్ అణు అహంకారం బద్దలు.. ఆపరేషన్ సిందూర్‌పై సంచలన రిపోర్ట్..
-
KTR: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇంటర్వెల్ పడిపోయింది.. ఫస్ట్ హాఫ్ డిజాస్టర్!
-
VIJAY : తమిళనాడు సీఎం విజయ్ – భార్య సంగీతను కలిపేందుకు ప్రయత్నాలు
-
Police Complaint Director: వారి వల్లే వరలక్ష్మికి సారీ చెప్పా.. సమస్య సద్దుమణగలేదు!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!