PM Modi: ‘‘అస్సాంను పాక్‌కు అప్పగించాలని కాంగ్రెస్ కుట్ర’’.. మోడీ వ్యాఖ్యలపై హస్తం పార్టీ ఫైర్..
- అస్సాంను పాక్‌కు అప్పగించే కుట్ర..
- కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన ప్రధాని మోడీ..
- మోడీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: అస్సాం పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. స్వాతంత్య్రానికి ముందు అస్సాంను పాకిస్తాన్‌కు అప్పగించాలని కాంగ్రెస్ కుట్ర చేసిందని మోడీ ఆరోపించారు. అయితే, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం తెలుపుతూ, ఎదురుదాడి చేసింది. శనివారం గౌహతిలో జరిగిన ఒక ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘‘అస్సాంను పూర్వపు తూర్పు పాకిస్తాన్లో భాగం చేయడానికి ముస్లిం లీగ్, బ్రిటిష్ వారితో చేతులు కలపడానికి సిద్ధమవడం ద్వారా కాంగ్రెస్ “పాపం” చేసింది’’ అని అన్నారు.
అయితే, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత, లోక్‌సభ ఎంపీ మాణికం ఠాగూర్ స్పందించారు. ఈ ఆరోపణల్ని ఎక్స్ వేదికగా ఖండించారు. అస్సాంను పాకిస్తాన్‌కు అప్పగించే ప్రతిపాదన లేదని ఆయన అన్నారు. అస్సాం హిందూ మెజారిటీ ప్రావిన్స్ అని, విభజన ప్రణాళికలో పాకిస్తాన్ భాగంగా అస్సాం లేదని, అస్సాంలోని సిల్హెల్ జిల్లా ముస్లిం మెజారిటీ ప్రాతం అని ఆయన అన్నారు. ఇప్పుడు సిల్హెల్ జిల్లా బంగ్లాదేశ్‌లో భాగంగా ఉంది.
Also Read
- Iran invites PM Modi: ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకండి.. మోడీకి ఇరాన్ ఆహ్వానం..
- India Iran Travel Advisory: ఇరాన్‌కు అనవసర ప్రయాణాలు వద్దు.. పౌరులకు హెచ్చరిక జారీ చేసిన భారత రాయబార కార్యాలయం
- Ketan Agarwal Murder Case: అప్పుడు ‘సోనమ్’.. ఇప్పుడు ‘సియా’.. పెళ్లి అంటేనే భయపడుతున్న అబ్బాయిలు..
- Delhi: తెల్లవారుజామున కలకలం.. కార్మికుల గుడిసెల్లో భారీ అగ్నిప్రమాదం.!
Read Also: Railway fare hike: రైలు ప్రయాణికులకు షాక్.. పెరిగిన రైల్వే ఛార్జీలు..
అస్సాం మొదటి సీఎం, కాంగ్రెస్ నేత గోపీనాథ్ బోర్డోలోయ్ పేరు మీద ఉన్న గౌహతి ఎయిర్‌పోర్ట్‌లో మోడీ కొత్త టెర్మినల్ ప్రారంభించారు. అస్సాంను రక్షించడానికి బోర్డోలోయ్ కాంగ్రెస్‌ను ధిక్కరించారని ప్రధాని అననారు. అస్సాం గుర్తింపును నాశనం చేసే చర్యల్ని ఆయన వ్యతిరేకించారని, అస్సాం దేశం నుంచి వేరు కాకుండా కాపాడారని ప్రధాని అన్నారు.
అయితే, మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ఠాగూర్ స్పందిస్తూ.. జూలై 1947లో బ్రిటీష్ అధికారంలో ఉన్న సిల్హెట్ జిల్లాలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందని, ఆ తర్వాత అది తూర్పు బెంగాల్లో ఆ తర్వాత తూర్పు పాకిస్తాన్లో భాగమైదని పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్ నిర్ణయం కాదని గోపీనాథ్ బోర్డోలోయ్ ప్రయత్నాల కారణంగా కరీంగంజ్ సబ్ డిస్ట్రిక్ట్ భారత్‌లోనే ఉంచబడిందని చెప్పారు. ప్రధానిపై విమర్శలు చేస్తూ.. మోడీ శిక్షణ పొందిన ఆర్ఎస్ఎస్ వ్యక్తి అని, అబద్ధాలు వ్యాప్తి చేయడం ద్వారా జీవిస్తున్నారని అన్నారు.
తాజావార్తలు
-
Mirzapur: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మిర్జాపూర్ పోస్టర్స్! మున్నా భాయ్ మళ్లీ వస్తున్నాడా?
-
Ayush Singh: డిగ్రీ లేదు.. ఉద్యోగం లేదు.. కానీ ఏఐ (AI) తో నెలకు రూ.కోటి సంపాదన! ఎలాగో తెలుసా?
-
Cow Milk: ఏడాది నిండకముందే పిల్లలకు ఆవు పాలు ఇస్తున్నారా? ఎయిమ్స్ వైద్యుడి హెచ్చరిక
-
Iran invites PM Modi: ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకండి.. మోడీకి ఇరాన్ ఆహ్వానం..
-
Italy: ఇటలీ రెస్టారెంట్లో భారతీయులపై బంగ్లాదేశ్ వెయిటర్ జాత్యహంకార వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
సూపర్‌కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!
-
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!