PM Modi: అస్సాం పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. స్వాతంత్య్రానికి ముందు అస్సాంను పాకిస్తాన్‌కు అప్పగించాలని కాంగ్రెస్ కుట్ర చేసిందని మోడీ ఆరోపించారు. అయితే, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం తెలుపుతూ, ఎదురుదాడి చేసింది. శనివారం గౌహతిలో జరిగిన ఒక ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘‘అస్సాంను పూర్వపు తూర్పు పాకిస్తాన్‌లో భాగం చేయడానికి ముస్లిం లీగ్, బ్రిటిష్ వారితో చేతులు కలపడానికి సిద్ధమవడం ద్వారా కాంగ్రెస్ "పాపం"…