Mirzapur: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మిర్జాపూర్ పోస్టర్స్! మున్నా భాయ్ మళ్లీ వస్తున్నాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mirzapur: ఓటీటీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ‘మిర్జాపూర్’ సిరీస్ ఇప్పుడు వెండితెరపై రచ్చ చేయడానికి రెడీ అవుతుంది. ‘మిర్జాపూర్: ది మూవీ’ (Mirzapur: The Movie) టీజర్ రిలీజ్‌కు సరిగ్గా ఒక్క రోజు ముందు, చిత్ర యూనిట్ ప్రేక్షకులలో అంచనాలను స్కై హైకి తీసుకెళ్లేలా పవర్ఫుల్ ఫస్ట్ లుక్ క్యారెక్టర్ పోస్టర్లను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మిర్జాపూర్ సామ్రాజ్యాన్ని శాసించిన ఐకానిక్ పాత్రలైన కాలీన్ భయ్యా, మున్నా భయ్యా, గుడ్డు భయ్యా లుక్స్‌తో మేకర్స్ ఈ పోస్టర్లను డిజైన్ చేశారు. “గద్దీ హై తో హమ్ హమ్ హై” (సింహాసనం ఉంటేనే మనం ఉంటాం) అనే పవర్ఫుల్ క్యాప్షన్‌తో రిలీజ్ చేసిన ఈ పోస్టర్లు.. ఈ సినిమాలో అధికారం, వారసత్వం, రక్తపాతం ఏ రేంజ్లో ఉండబోతున్నాయో హింట్ ఇస్తున్నాయి. ఈ క్రేజీ క్యారెక్టర్లు మళ్లీ థియేటర్లలో సందడి చేయనుండటంతో అభిమానుల్లో సరికొత్త జోష్ నెలకొంది.
ఈ భారీ యాక్షన్ డ్రామా చిత్రానికి గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా, పునీత్ కృష్ణ కథను అందించారు. అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్‌తో కలిసి ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు రితేష్ సిద్ధ్వానీ, ఫర్హాన్ అక్తర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కాసిమ్ జగ్మాగియా, విశాల్ రామ్‌చందానీ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. హిందీతో పాటు తెలుగు భాషలోనూ ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా 2026 సెప్టెంబర్ 4న ఈ మూవీ థియేటర్లలోకి రాబోతోందని మేకర్స్ అనౌన్స్ చేశారు. రేపు రిలీజ్ కానున్న ఈ చిత్ర టీజర్ కోసం సినిమా లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
Gaddi hai toh hum hain. #MirzapurTheMovie Teaser out tomorrow at 12PM.
Watch #MirzapurTheMovie only in cinemas in Hindi & Telugu#AliFazal @TripathiiPankaj @divyenndu #JitendraKumar @ravikishann @nowitsabhi @RasikaDugal @battatawada @ShriyaP @HarshitaGaur12 @sushant_says… pic.twitter.com/aKujPQzCpD
— Farhan Akhtar (@FarOutAkhtar) June 24, 2026
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!